ఫణిగిరి: బౌద్ధ శిల్పకళాపతాక-3

కానీ ఫణిగిరి కొండమీద విహారంలో ఒక స్మారక స్తంభాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ శిల్పులకి తమ సమకాలిక ప్రపంచానికి అత్యవసరంగా చెప్పవలసింది ఈ సందేశమేనని తోచిందని నాకు అర్థమవుతున్నది. గొప్ప కళ ఎప్పుడూ ఇలా రెండు తలాల్లో మాట్లాడుతుంది.