ఆ లోకం లెక్కలు వేరే

నానాటికీ మనం ప్రతిఒక్కరం పరస్పరం,
దట్టమైన వలలో పోగుల్లాగా, దగ్గరవుతున్నాం.
ఇప్పుడిక్కడ ఏ ఒక్కరు గాయపడ్డా, ఆ నొప్పి,
క్షణాల్లో, మొత్తం ప్రపంచానికి పాకుతుంది.

చూడ్డానికిదంతా గొప్పగానే కనిపిస్తుందిగానీ,
ఇది వట్టి వినియోగదారుల అనుబంధం.
తూకం ఎక్కడ తేడా వచ్చినా అక్కడికక్కడే
ఆగిపోయే క్రయవిక్రయాల వ్యవహారం.

సంతోషాన్ని ధారాళంగా వెదజల్లే లోకంలో
లెక్కలు వేరేలా ఉంటాయి. చిగురిస్తున్న చెట్లు
కురిపిస్తున్న కాంతి ఏ ఒక్కరు మూటగట్టుకున్నా,
ఆ లబ్ధిలో, మొత్తమందరికీ వాటా దక్కుతుంది.

27-3-2026

6 Replies to “ఆ లోకం లెక్కలు వేరే”

  1. చిగురిస్తున్న చెట్లకురిపిస్తున్న కాంతి తమరు. గాయపడ్డ నాకు మీ భావాలే నాకు ఉపశమనం. సర్. మీకు నా ధన్యవాదాలు

  2. One of your best poems and reflects your spirit so very well. ఇది చదవకముందే నా పుట్టినరోజు విషెస్ రాసుకున్నాను.
    మీ కవిత్వంలో నేను చూసేది ఈ లెక్కలు లేని ప్రపంచాన్నేనని.. సంతోషంగా, గర్వంగా ఉంది సర్. మీ కవిత్వం నాకుందరిగానే అర్థమైందన్న నమ్మకం కలిగి.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మానసా!

  3. నాకు సరిగానే**
    (ఎడిట్ చేశాక కూడా తప్పు పబ్లిష్ అయింది 😭)

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%