ఆ విధంగా దక్షిణభారతసాహిత్యానికి వేములవాడ ఇచ్చిన ఉపాదానం అద్వితీయమైంది. ప్రపంచ సాహిత్యచరిత్రల్లోనే ఇటువంటి గణనీయమైన పరివర్తనకు కారణమైన నగరాల్ని వేళ్ళమీద మాత్రమే లెక్కించగలుగుతాం.
తెలంగాణా హెరిటేజి మూజియం
అమెరికాలో ఇటువంటి మూజియాలకీ, చిత్రకళాప్రదర్శనలకీ ఎంత ఆదరణ ఉంటుందో స్వయంగా చూసిన విజయసారథిగారు ఆ మూజియంలో తిరుగుతున్నంతసేపూ దిగులు పడుతూనే ఉన్నారు. ఏం చేస్తే మన ప్రజలకి ఇటువంటి విలువైన వారసత్వసంపద పైన దృష్టి మళ్ళుతుంది? ఒక మాల్ కో, మల్టీప్లెక్సుకో పిల్లల్ని తీసుకువెళ్ళడంలో సంతోషాన్ని పొందుతున్న మన కుటుంబాలకి తమ పిల్లలని ముందు ఇటువంటి మూజియంలకు తీసుకురావడం అత్యవసరమని ఎప్పుడు తెలుస్తుంది? ఇవే ఆయన నన్ను పదే పదే అడుగుతున్న ప్రశ్నలు.
కుంచించుకుపోయిన సమాధులు
కానీ ఇండో-సారసనిక్ వాస్తు అన్నిటికన్నా ముఖ్యంగా కోరుకునేది విశాలమైన జాగాని. సువిశాలమైన ప్రాంగణాల్ని. ఆ జాగానే కుదించిపోయాక, ఆ లోపల గుమ్మటాలు కూడా కుదించుకుపోయినట్టే అనిపిస్తుంది నా వరకూ.
