ఒక సంగీత సాయంకాలం

నిన్న సాయంకాలం ఆ సితారు ఆలాపన వింటున్నంతసేపూ నాకు ఒక నది ఒడ్డున కూచున్నట్టూ, నా పాదాలు ఆ నీళ్ళల్లో మునిగీ మునక్కుండా పెట్టుకున్నట్టూ, చిన్ని చిన్ని నీటితరగలు నా పాదాల్ని తాకి విరిగి కిందకి జారిపోతుంటే, నా హృదయంలోపల ఎవరో చేయిపెట్టి మెత్తని సున్నితమైన తంత్రులేవో కెరలిస్తున్నట్టూ అనిపించింది.

స్వర-మిలన్

సంగీతం వినేప్పుడు నా అనుభూతి కూడా అటువంటిదే. అంతేకాదు, గొప్ప చిత్రలేఖనాలు చూస్తున్నప్పటిలాగా, గొప్ప కావ్యాలు చదువుతున్నప్పటిలాగా, ఆ సంగీతం నాలోని ఏవో పురాస్మృతుల్ని కెరలిస్తుంది. నెమ్మదిగా నేనొక మధుర విస్మృతిలోకి జారుకుంటాను.

ఇది కదా భారతదేశం

అలా భారతదేశపు నలుమూలలకూ చెందిన చిత్రకారులు మరో ధ్యాసలేకుండా తాము చూస్తున్న దేశాన్నీ, సమాజాన్నీ, సౌందర్యాన్నీ చిత్రించడంలోనే తలమునకలుగా ఉండే ఆ దృశ్యాన్ని చూస్తుంటే, మాకు 'ఇది కదా భారతదేశం' అని అనిపించింది. ఎప్పట్లానే ఈ జాతీయ చిత్రకళా ప్రదర్శన కూడా నాకు మరొక discovery of India గా తోచింది.