నిద్రకీ మెలకువకీ ఆవల

(ఆధునిక చీనా కవుల్లో ఫెంగ్-ఝి (1905-93) కొన్నాళ్ళు జర్మనీలో చదువుకున్నాడు. ఆధునిక జర్మను కవుల్ని ఆధునిక చీనాకి పరిచయం చేసాడు. 1941 లో, ఒకవైపు సమస్తచీనా విప్లవం వైపు ప్రయాణిస్తుండగా, మరొక వైపు అతడు జర్మన్ మహాకవి రిల్క స్ఫూర్తితో తన అంతరంగ ప్రపంచంలోకి సాహసయాత్ర చేస్తూన్నాడు.)


పూర్తిగా కళ్ళు విప్పుకుని మెలకువగా
ఉన్నామనుకున్నప్పుడు కూడా, మన
కళ్ళు అరమోడ్పుగా ఈ ప్రపంచంలోనే
మరొక ప్రపంచాన్ని గుర్తుపడుతుంటాయి.

రోడ్డుమీద ప్రయాణిస్తుంటామా, వాహనాలు
హారన్లు, ట్రాఫిక్, సిగ్నళ్ళు, పనితొందర-
వీటిమధ్యనే వేప పూల తీపి గాలి వెనక్కి
లాగుతుంది, నీలో ఒకడక్కడే ఆగిపోతాడు.

అలా ఆగిపోయినవాడు ఏ చీనాకవితోనో
రాత్రి మళ్ళా నీ తలుపు తడతాడు. అర్థరాత్రి
నీ నిద్రాద్వారం దగ్గర అరమోడ్పు కళ్ళతోనే
వాళ్లనొక జర్మను కవితలో పోల్చుకుంటావు.


(ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా)

20-3-2016

10 Replies to “నిద్రకీ మెలకువకీ ఆవల”

  1. మీ వంటి కవులు కవిత్వం రాయడం వల్ల ఈ రోజు ఇంత ప్రత్యేకమైంది. థ్యాంక్ యూ సర్. ❤️

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మానసా! ఈ రోజు మనందరిదీ!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%