ఇప్పుడు ఆ రిపబ్లిక్కులు సోవియేటు రష్యానుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డా, ఆ రోజుల్లో ఆ రచయితలు సృష్టించిన సాహిత్యాలు మాత్రం, మానవ జాతి చరిత్రలోని ఒక ఉజ్జ్వల భర్మయుగాన్ని గుర్తుచేస్తూ శాశ్వతంగా మిగిలిపోయేయి. అటువంటి రచనల్లో, ‘కొండగాలీ, కొత్త జీవితం, ఆర్మీనియన్ కథలు’ (1979) ఒకటి.
నన్ను వెన్నాడే కథలు-15
ఇలా ఏదో నీలమూ, ఆకుపచ్చా కలగలసిన ఒక మరకగా ఆ కథ నాకు గుర్తుండిపోయింది. ఆతృతగా పుస్తకం ముందుకీ వెనక్కీ స్క్రోలు చేస్తూ ఉన్నాను. కానీ మొత్తం కథలన్నీ మరోసారి చదవనక్కర్లేకుండానే ఆ కథ దొరికింది.
నన్ను వెన్నాడే కథలు-14
నలభయ్యేళ్ళ కింద నేను చదివిన కథల్లో బహుశా అత్యంత విషాదాత్మకమైన కథ లేదా మరోలా చెప్పాలంటే అత్యంత fatal short story కాఫ్కా రాసిన TheJudment (1912). ఎందుకంటే ఈ కథ చదివాకనే నా మిత్రుడు కవులూరి గోపీచంద్ మా అందరికీ మానసికంగానే కాక, భౌతికంగా కూడా, దూరమైపోయాడు.
