ఆ రోజు నా ప్రసంగంలో నేను ప్రధానంగా గత మూడు శతాబ్దాలుగా వేమన తెలుగు వారికి ఎప్పటికప్పుడు కొత్తగా ఎలా కనిపిస్తూ వస్తున్నాడో వివరించేను. అయితే ఈ విషయం నేను గతంలో కూడా చెప్పిందే. కాని ఈసారి నేను కొత్తగా చెప్పిందేమంటే, ప్రతి ఒక్క శతాబ్దంలోనూ వేమన కొత్తగా కనిపించడం కాదు, ఎప్పటికప్పుడు వేమన కొత్తగా రూపొందుతున్నాడు అన్నది.
కథలు ఎలా పయనించేయి-3
ప్రాచీన భారతదేశ కథాచట్రాన్ని మధ్యయుగ భారతదేశానికి మధ్యయుగ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దినవారు జైనులు. జైనులు నిర్వహించిన ఈ మహోన్నత చారిత్రక సాహిత్య పాత్ర గురించి దురదృష్టవశాత్తూ ఈనాటి రచయితలకీ, పండితులకీ, పాఠకులకీ కూడా దాదాపుగా తెలియదనే చెప్పాలి. కాని జైనులే లేకపోతే, భారతీయ సాహిత్యం ఇలా ఉండి ఉండేదే కాదు.
రెండు స్పందనలు
నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా మొన్న శుక్రవారం ప్రసగంలో నేను ఫ్రెడరిక్ డగ్లస్ ఆత్మకథ గురించి మాట్లాడేను. ఆ పుస్తకానికి ముక్తవరం పార్థసారథిగారు చేసిన అనువాదాన్ని పీకాక్ క్లాసిక్స్ గాంధి గారు 2011 లో ప్రచురించిన సంగతి కూడా చెప్పాను. ఆ మర్నాడే, విజయ్ జీడిగుంట ఆ పుస్తకం చదవడమే కాక, తన అనుభూతిని తన వాల్ మీద పంచుకున్నారు కూడా.
