మళ్ళీ హైదరాబాదుకి.

ఈ ఊళ్ళో కూడా మంచి చెడులు రెండూ నాకు అనుభవానికొచ్చి ఉండవచ్చు. కాని విజయవాడ నాకు మంచిని మాత్రమే గుర్తుండిపోయేలా చేసింది. ఆ పరిణతిని నాకు నేర్పినందుకు ఆ తల్లికి నా సాష్టాంగ ప్రణామాలు.

పరవశ

ఇందులో తల్లి ఉంది, తనయుడు ఉన్నాడు, సహచరుడు ఉన్నాడు, ఒక స్త్రీ జీవితంలోని సమస్త అవస్థలూ ఉన్నాయి. అందరి జీవితాల్లో ఉన్నదే ఈమె జీవితంలోనూ ఉన్నది. కాని ఆ జీవితానుభవం ఒక అక్షరంగా మారడంలోనే ఈమె జీవితసార్థక్యం.

ఒక సాయంకాలం

ఎందుకు పోరాడుకుంటున్నారో తెలియకుండా ఒకరినొకరు గాయపరుచుకుంటున్నవాళ్ళని చేరదీసి, వారిమీద ఎట్లాంటి జడ్జిమెంట్లూ ఇవ్వకుండా, వారి గాయాలకు కట్టుకట్టి స్వస్థ పరిచే చిన్న ఓదార్పు సాహిత్యం. అటువంటి ఒక స్వాస్థ్య ఉద్యమంలో నేనొక చిన్న కార్యకర్తని కావాలన్నదే నా కోరిక.