ఎంతమంది తెలుగువాళ్ళు, ఎంతమంది భారతీయులు అమెరికా వెళ్ళలేదు, ఎంత మంది అక్కడ నివసించడం లేదు! కాని ఈ స్ఫురణ, ఆదికవి వాల్మీకికీ, అమెరికన్ మహాకవి వాల్ట్ విట్మన్ కీ ఉన్న ఈ పోలిక ఇప్పటిదాకా ఎవరికీ తోచకపోవడం ఎంత ఆశ్చర్యం! నేను కూడా చదివాను, Out of the Cradle Endlessly Rocking- కానీ నాక్కూడా తట్టలేదు. ఇది విజయసారథి వంటి రసాన్వేషికి మాత్రమే తట్టే స్ఫురణ. ఒక్కమాటలో చెప్పాలంటే, a once in a lifetime insight!
సముద్రమంత కవి
శ్రీ శ్రీ జీవితం పొడుగునా ఒక మహాసముద్రం రహస్యంగా ఆయనలో ఘూర్ణిల్లుతూనే ఉంది. లేదా ఒక మహాసముద్రంలో ఆయన ఈదుతూనే ఉన్నాడు. 'శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు' ఆయన ఆ సముద్రతరంగాల్లోనే విన్నాడు.
నన్ను వెన్నాడే కథలు-20
ఒక శతాబ్దం గడిచిపోయేక, ఇప్పుడు ఓ హెన్రీ కథలు చదువుతుంటే, అతడిలోని సామాజిక విమర్శకుడు చాలా ప్రస్ఫుటంగా దర్శనమిస్తున్నాడు. ముఖ్యంగా, న్యూయార్కు నగరజీవితం మీద అతడు రాసిన కథలు. ఇరవయ్యవ శతాబ్దపు తొలిరోజుల్లో విస్తరిస్తున్న ఒక మహానగరపు రథచక్రాల కింద నలిగిపోతున్న అధోజగత్సహోదరుల యథార్థ గాథల్ని అతడు ఎంతో ప్రతిభావంతంగా చిత్రించాడు. ఒక మహానగరజీవితాన్ని దాని విస్మృత పార్శ్వాలనుంచి ఇంత కథనకౌశల్యంతో పట్టుకున్న కథకుడు మనకి మరొకరు కనిపించరు.
