పాడకుండా ఉండలేని పాట

ఒక రాత్రి నామదేవుడితో కలిసి పాండురంగడు తుకారాం కలలో అడుగు పెట్టాడు. అతడి ముందు తక్కెడ చాపాడు. ఒకవైపు సిబ్బెలో నామదేవుడు కోటి కీర్తనలు పోగు పోశాడు. ‘అయినా ఇంకా బాకీ తీరలేదు, మిగిలిన పాటలు నువ్వు పాడు’ అని అన్నాడట విఠలుడు తుకారాముతో.


పొద్దున్న ఆ పుస్తకాల షాపు లో
అడుగుపెట్టానో లేదో
నా మీద వలవిసిరింది మామిడి చెట్టు.

ఊపిరి ఆడనివ్వకుండా
ఒళ్లంతా వెయ్యి చేతులతో
చుట్టేసింది పుప్పొడి.

ఏదీ! ఇప్పుడొక కవిత రాయి
అని అడిగావు నువ్వు.

తేరుకోవడం చాలా కష్టమైంది.
నీకు తెలుసు కదా
నేనీ సంతోషాన్ని
స్వీకరించే స్థితిలో లేనని.

ఇంకా ఏ పాటలు
మిగిలిపోయాయని
ప్రభో!
నువ్విట్లా
నా మెలకువ లోనే
నా వెంటపడుతున్నావు?

2-2-2024

13 Replies to “పాడకుండా ఉండలేని పాట”

  1. “ఊపిరి ఆడనివ్వకుండా వేయి చేతులతో చుట్టేసింది పుప్పొడి”… చాల బాగుంది సార్ 🙏

  2. Access Success @ aimkaam – aimkaam in association with Talentedge, Gurgaon offers online, interactive, live, short term, weekend courses which will help grab a job, promotion of your choice. If you are struggling to grab a job or take your career to next level, please feel free to contact us to attract a job or promotion of your choice.
    Access Success @ aimkaam says:

    ఏమనలేను! మూగనయ్యాను! స్వామి కరుణిస్తే అంతే!🙏

  3. మరోవైపు సిబ్బెలో ఏముంది గురువుగారు.. నామదేవుడి కీర్తనలో పాండిత్యము తప్ప భక్తి లేదా!? 🤔

  4. 🙏ధన్యవాదాలు గురువుజీ.. భగవంతుడు ఇలా భక్తులకు కవులకు బాకీ పడటం వల్లే కనిపించకుండా తిరుగుతున్నాడు ☺

  5. మీ కవిత బాగుంది సర్.

    ఒక పేరడీ తవిక

    పొద్దున్నే వీధిలోకి
    అడుగుపెట్టానో లేదో
    నా మీద వలవిసిరింది చెత్తకుండీ

    ఊపిరి ఆడనివ్వకుండా
    ఒళ్లంతా వెయ్యి మూతులతో
    చుట్టేసింది దుర్వాసన

    ఏదీ! ఇప్పుడొక కవిత రాయి
    అని అడిగావు నువ్వు.

    తేరుకోవడం చాలా కష్టమైంది.
    నీకు తెలుసు కదా
    నేను సంతోషాన్ని
    స్వీకరించే స్థితిలో లేనని.

    Sorry sir just for fun.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%