
గత పదిపన్నెండేళ్ళుగా నేను తెలుగు కథాసంపుటాలమీదా, నవలలమీదా రాస్తూ వచ్చిన వ్యాసాల్ని కథల సముద్రం పేరుమీద పుస్తకంగా వెలువరించాను. అదే సమయంలో ప్రపంచ కథకులమీదా, నవలలమీదా రాస్తూ వచ్చిన 31 వ్యాసాల్ని ఇప్పుడిలా ‘కొత్త యుగం రచయిత్రి’ పేరిట ఒక సంపుటిగా వెలువరిస్తున్నాను.
ఇందులో టాల్ స్టాయి, బోర్హెసు, నికోసు కజంజకిసు, థియోడరు స్టార్ము, క్లారిస్ లిస్పెక్టరు, మురియెలు స్పార్కు వంటి ప్రపంచ రచయితలతో పాటు బంకింబాబు, టాగోరు, గోపీనాథ మొహంతి, ఎం.టి.వాసుదేవన్ నాయరు వంటి భారతీయ నవలాకారుల రచనల పైన కూడా విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా నోబెలు బహుమతి పొందిన ఫ్రెంచి రచయితలు పాట్రిక్ మోడియానో, అన్నీ ఎర్నోలతో పాటు దక్షిణా కొరియా రచయిత్రి హన్ కాంగ్ ల రచనల పైన కూడా పరిశీలనలు ఉన్నాయు. బుకర్ బహుమానం పొందిన భారతీయ రచయిత్రులు గీతాంజలి శ్రీ, బానూ ముష్తాక్ ల రచనల పైన కూడా స్పందనలు ఉన్నాయి. అపురూపమైన తెలుగు రచయిత, అకాలమరణం చెందిన చిత్రకొండ గంగాధర్ నవలని కూడా అంతర్జాతీయ స్థాయి రచనగా భావిస్తూ ఆ పుస్తకం పైన వ్యాసాన్ని కూడా ఇందులో పొందుపరిచాను.
ఈ పుస్తకాన్నిక్కడ డౌన్లోడు చేసుకోవచ్చు.
దీన్ని ఆత్మీయుడు సోమశేఖర్ కి కానుక చేస్తున్నాను.
ఇది నా 71 వ పుస్తకం.
4-10-2025
అపూర్వమైన కానుక పొందినందుకు ధన్యవాదాలు సర్!
ధన్యవాదాలు సోమశేఖర్!
నమోనమః
హృదయపూర్వక నమస్సులు.