నేనింతకుముందు మీతో ఒక సంగీతపత్రిక గురించి ముచ్చటించాను. Interlude.HK. ఆ పత్రిక 22-8-2025 నాటి సంచికలో పర్వతాల మీద కూర్చిన పదిహేను శాస్త్రీయ సంగీత కృతుల గురించి వివరంగా రాసింది. పాశ్చాత్య సంగీతంలో, పర్వతారోహణల్నీ, పర్వతగాంభీర్యాన్నీ, పర్వతసౌందర్యాన్నీ సంగీతంలోకి అనువదించిన పదిహేను కృతులు. వాటిల్లో Franz Liszt కృతి కూడా ఒకటి ఉంది. ఆధునిక ఫ్రెంచి సాహిత్యవేత్తల్లో అగ్రగణ్యుడైన విక్టర్ హ్యూగో 1831 లో రాసిన Ce qu'on entend sur la montagne' ( What …
