వేపపూల తీపిగాలి

అందుకని 64 కవితలు ఎంచి ఇమ్మని మానస చామర్తిని అడిగారు. ఆమె నేను ఇంతదాకా వెలువరించిన 8 సంపుటాల్లోంచీ, ఈ ఏడాది పొడుగునా నా బ్లాగులో రాస్తూ వచ్చిన కవితల్లోంచీ 64 కవితలు ఎంపికచేసారు. వాటిని ఆమే, అనల్ప బలరాం గారూ ఇద్దరూ కలిసి ఇలా 'వేపపూల తీపిగాలి' పేరిట ఈ రోజు విడుదల చేసారు.

నన్ను వెన్నాడే కథలు

నలభయ్యేళ్ళ కిందట నేను చదివిన కొన్ని కథలు, ప్రపంచ సాహిత్యంలోవీ, భారతీయ భాషల్లోవీ, ఇరవై కథలు, నన్ను వెన్నాడే కథలు గా, గత ఆరునెలలుగా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ కథలన్నిటినీ ఒక్కచోట ఇలా పుస్తకరూపంగా మీకు అందిస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తక ప్రేమికుల పెన్నిధి బంగారు రామాచారికి ఈ పుస్తకం కానుక చేస్తున్నాను. ఇది నా 75 వ పుస్తకం.

మరో నాలుగు పుస్తకాలు

ఇప్పుడు నా రచనలలో సరికొత్తగా మరో నాలుగు పుస్తకాలు మొన్ననే ప్రింటు కాపీలు విడుదల అయ్యాయి. Shri Pada Literary Works వారు వెలువరించిన నాలుగు పుస్తకాలూ ఇవి. ఇందులో బసవన్న వచనాలు కిందటేడాది వెలువరించినప్పటికీ ఆ 100 కాపీలు అయిపోవడంతో, చాలామంది మిత్రులు పదేపదే అడుగుతుండటంతో, ఆ పుస్తకం కూడా మరోసారి ముద్రించి విడుదల చేస్తున్నారు. ఒక్కొక్క పుస్తకం 100 కాపీల చొప్పున మాత్రమే ప్రింటు చేయించారు కాబట్టి ఆసక్తి ఉన్నవారు తెప్పించుకోవచ్చు.