
పుస్తక పరిచయ ప్రసంగ పరంపరలో భాగంగా, ఈ నెల నాలుగు శుక్రవారాలూ, నల్లజాతి చరిత్ర మాసోత్సవాన్ని పురస్కరించుకుని, ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన ప్రసంగించాను. ఈ రోజు నల్లజాతి మాసోత్సవం నేపథ్యం గురించి వివరించి, తొలి ఆఫ్రికన్-అమెరికన్ కవయిత్రి ఫిల్లిస్ వీట్లి గురించి ప్రసంగించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
ఈ అంశం పైన 2018 లో నేను రాసిన వ్యాసాల్ని ‘వికసించిన విద్యుత్తేజం ‘పేరిట కిందటేడాది పుస్తకంగా వెలువరించాను. ఆ పుస్తకం పిడిఎఫ్ ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
ఆఫ్రికన్-అమెరికన్ కవిత్వం గురించిన పరిచయం కోసం The Vintage Book of African American Poetry (2020) చదవమని సూచిస్తున్నాను.
6-2-2026
ఇప్పుడే పుస్తకాన్ని download చేసుకున్నాను.
చదువుతున్నాను.
చాలా బాగుంది.
అందరూ చదువవలసిన పుస్తకం.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!