పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు అవధూత గీత పైన ప్రసంగిమను. దత్తాత్రేయులు రాసారని భావించే ఈ గీత, భారతీయ తాత్త్విక సాహిత్యంలో, అత్యుత్తమ కృతుల్లో ఒకటి. స్థితప్రజ్ఞుడు ఏం మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు, దేని వల్ల నిలబడగలుగుతాడు అన్నదానికి భగవద్గీత ఒక వివరణ అయితే, విముక్తమానవుడు ఎలా ఉంటాడు, ఎలా భావిస్తాడు, ఎలా మాట్లాడతాడు అన్నదానికి అవధూత గీత ఒక నిరూపణ. ఈ పుస్తకం మీద నా ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
మూడో ఉత్తరం
మార్కస్ అరీలియస్ Meditations పైన నా ప్రసంగాలు వింటూ, శ్రీమతి మాధవిగారు వారమ్మాయికి రెండు ఉత్తరాలు రాసారనీ చెప్తూ, ఆమె అనుమతితో, వాటిని గతంలో మీతో పంచుకున్నాను. ఇది మూడో ఉత్తరం.
నన్ను వెన్నాడే కథలు
నలభయ్యేళ్ళ కిందట నేను చదివిన కొన్ని కథలు, ప్రపంచ సాహిత్యంలోవీ, భారతీయ భాషల్లోవీ, ఇరవై కథలు, నన్ను వెన్నాడే కథలు గా, గత ఆరునెలలుగా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ కథలన్నిటినీ ఒక్కచోట ఇలా పుస్తకరూపంగా మీకు అందిస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తక ప్రేమికుల పెన్నిధి బంగారు రామాచారికి ఈ పుస్తకం కానుక చేస్తున్నాను. ఇది నా 75 వ పుస్తకం.
