
39
నాట్యమూ, గానమూ నా శరణాలయాలు
వాటిద్వారానే నేన్నిన్ను సేవించుకుంటాను.
నీ నిద్రకు వేళైనప్పుడు సెలవు తీసుకుంటాను
నువ్వు దిగివస్తే నా జీవితాన్నే హారతిస్తాను
తక్షణమే సుశ్రావ్యగీతాలు ఆలపిస్తాను
మధురాలాపన మొదలుపెడతాను
తుకా అంటున్నాడు: ఎంత ఉదారుడివి
ఒక్కక్షణంలో నా బరువు దింపేస్తావు.
नाच गाणें माझा जवळील ठाव । निरोपीन भाव होईल तो ॥१॥
तुम्हां निद्रा मज आज्ञा ते स्वभावें । उतरूनि जीवें जाईन लोण ॥ध्रु.॥
एकाएकीं बहु करीन सुस्वरें । मधुर उत्तरें आवडीनें ॥२॥
तुका म्हणे तूं जगदानी उदार । फेडशील भार एका वेळा ॥३॥ (500)
40
నిజంగా భాగ్యవంతుల పని ఒక్కటే
తమ వాక్కుతో నీ నామాన్ని కొలవడమే.
ఆనందంతో వాళ్ళు ఉప్పొంగిపోతే
వాళ్ళతో పాటు వాళ్ళ శ్రోతలూ తరిస్తారు
పంటపండినవాడు తినేదెంత?
సంతోషమంతా అతడి అతిథులది.
తుకా గురువులకు మొక్కుతున్నాడు.
సాగిలపడి ప్రణమిల్లుతున్నాడు.
भाग्यवंतां हें चि काम । मापी नाम वैखरी ॥१॥
आनंदाची पुष्टि अंगीं । श्रोते संगीं उद्धरती ॥ध्रु.॥
पिकलें तया खाणें किती । पंगतीस सुकाळ ॥२॥
तुका करी प्रणिपात । दंडवत आचारियां ॥३॥ (1360)
41
నేను నా గర్భంలో ప్రవేశించాను
నన్ను నేనే ప్రసవించాను.
నా ప్రార్థనలు ఫలించాయి
నా పరితాపాలు తొలగిపొయ్యాయి.
నేను మరణించిన తక్షణమే
మరింత ఆరోగ్యవంతుణ్ణయ్యాను.
ఇరుపక్కలా పరికించి చూస్తే
తుకా ఎలా ఉన్నవాడలానే ఉన్నాడు.
मीचि मज व्यालों । पोटा आपुलिया आलों ॥१॥
आतां पुरले नवस । निरसोनी गेली आस ॥ध्रु.॥
जालों बरा बळी। गेलों मरोनि तेकाळीं ॥२॥
दोहींकडे पाहे । तुका आहे तैसा आहे ॥३॥ (1337)
42
నన్నెవరైనా నిందించవచ్చుగాక
మరెవరైనా కీర్తించవచ్చుగాక
నాకు చింతాలేదు, సంతోషమూ లేదు
రెండింటికీ దూరంగానే ఉన్నాను.
సుఖదుఃఖాలూ రెండూ కర్మానుసారం
ఏమి తటస్థించినా సంతోషమే.
నాకు నారాయణుడే సర్వస్వమయ్యాక
తుకాకూడా జనార్దనుడి సొంతమయ్యాడు.
निंदी कोणी मारी । वंदी कोणी पूजा करी ॥१॥
मज हें ही नाहीं तें ही नाहीं । वेगळा दोहीं पासुनी ॥ध्रु.॥
देहभोग भोगें घडे । जें जें जोडे तें बरें ॥२॥
अवघें पावे नारायणीं । जनार्दनीं तुक्याचें ॥३॥ (48)
Featured image: Cosmos bipinnatus ‘Versailles Dark Rose’ © Jason Ingram
14-5-2029
తుకాను తెలుగులో చదివే అవకాశం కలిగిస్తున్నారు వందనాలు.
ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు సార్!
“పంట పండినవాడు తినేదెంత…” అద్భుతంగా ఉన్నాయి సర్…ఒక్క క్షణం లో బరువు దించేట్టుగానే..❤️
ధన్యవాదాలు మానసా!