తమ సొంతబాగు చూసుకోని వాళ్ళు పక్కవాళ్ళ యిష్టాలకి అడ్డుపడతారు. దాంతో మరింత పాపం మూటగట్టుకుంటారు అది వాళ్ళ పతనానికి వేసిన మొదటి అడుగు. ..
అంటున్నాడు తుకా-16
ఎవరైనా సాధుసంతుల గోష్ఠి దొరికిందా నేను వాళ్ళింటిదగ్గర కుక్కలాగా పడుంటాను. అక్కడ రామనామసంకీర్తన వినగలుగుతాను వాళ్ళు తినగా వదిలిపెట్టింది తినిబతుకుతాను.
అంటున్నాడు తుకా-14
కొందరు నిందించవచ్చుగాక, కొందరు పూజించ వచ్చుగాక నన్నదీ తాకదు, ఇదీ తాకదు రెండింటికీ ఎడం నేను.
