వేసవివాన వచ్చివెళ్ళాక

పొద్దున్నే వేసవివాన వచ్చివెళ్ళాక
వీథులొకపట్టాన మామూలు కాలేవు.

ప్రతి చెట్టుగుబురులోనూ
తేమగా ఒక నిశ్శబ్దం.

కొందరుంటారు- ఇలా వచ్చి
అలా వెళ్ళిపోతారు
వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ
మనలోంచి కొంత పట్టుకుపోతారు.

లేదా ఒక్కొక్కప్పుడు కొంత
ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు.

వేసవివాన వచ్చివెళ్ళిపోయాక
కోకిల కూడా మూగదైపోతుంది.

ఇప్పుడు అదీనేనూ వెతుక్కుంటున్నాం
వదిలిపెట్టిందేదో, వెంట తీసుకుపోయిందేదో.

15-5-2025

14 Replies to “వేసవివాన వచ్చివెళ్ళాక”

  1. ఈ కోకిల! ఉన్నా లేకపోయినా…దాని సందడి తగ్గట్లేదు.

    Beautiful, sir ❤️

  2. మా బెజవాడలో కూడా ఈ పొద్దున్నే అట్లా జోరువానవెలిసిందా.. కప్పల సందడితో తెల్లవారింది..
    కోకిలకాలం ముగుస్తుందనే చింత మీరన్నట్లే..

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  3. Beautiful, sir! 🙏🏽

    మనలోని నిశ్శబ్దాన్ని వెంట తీసుకుపోయి
    మళ్ళీ వసంతకాలం వరకూ మనలో ఒక ఆశని వదలి వెళ్తుందేమో!!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%