ఆషాడ మేఘం- 9

పేయనార్ తన కవితల్లో విస్తారమైన వర్ణనకి పూనుకోడు. రూపకాలంకారాల్లో కూడా కొత్తదనం కోసం చూడడు. కవిసమయాలు అప్పటికే నిర్ధారితమైపోయి ఉన్నాయి కాబట్టి వాటిని దాటి కూడా వెళ్ళడు. కాని ఆ చట్రం మధ్యనే క్లుప్తతనీ, గాఢతనీ సాధించడం ద్వారానూ, ఉక్తి వైచిత్రిద్వారానూ ఆయన రసోత్పత్తి సాధిస్తాడు.