కోనసీమనుంచి కాలిఫోర్నియా దాకా

సాయి బ్రహ్మానందం రాసిన కథలు చదివేక సాహిత్యం వల్ల తన సంస్కారం, సంస్కారం వల్ల తన సాహిత్యం రెండూ కూడా బలపడ్డ ఒక రచయితని కనుగొన్న భావన కలిగింది. ఆ రచయిత పట్ల అపారమైన గౌరవం కలిగింది. ముఖ్యంగా, ఇందాకే చెప్పానే, ఆ కథ- 'లవ్ ఆల్' రాసిన కథకుడు తెలుగు కథకుడు అయినందుకు గర్విస్తున్నాను కూడా.