మధురవిషాద వీథిలో

ఆ మోహవిషాద సౌందర్యం బహుశా హిందీ, ఉర్దూ కవులకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదనిపిస్తుంది. అందుకనే శైలేంద్ర, భరత్ వ్యాస్, రాజేంద్ర కృష్ణ, మజ్రూ సుల్తాన్ పురీ, షహ్రాయర్ లాంటి సినిమా కవుల్ని నేను ఇరవయ్యవ శతాబ్దపు భక్తి కవులుగా లెక్కేసుకుంటాను.

వాక్ ఫర్ బుక్స్

నిన్న సాయంకాలం నాలిగింటికి సిద్ధార్థ కళాశాల ప్రాంగణం నుంచి పుస్తక ప్రదర్శన ప్రాంగణం దాకా సుమారు మూడున్నర కిలోమీటర్ల మేరకు పుస్తకప్రేమికులు, ప్రచురణకర్తలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఆ వాక్ లో పాల్గొన్నారు.