
మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ మీద ఈ రెండువారాల పాటు నా ఆలోచనలు పంచుకోడానికి ప్రోత్సాహమిచ్చిన మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు వీటిని ఇలా పుస్తకరూపంలో మీకు అందిస్తున్నాను. ఇందులో చివరలో కొందరు మిత్రుల స్పందనలు కూడా చేర్చుకున్నాను. అందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అరీలియస్ ఎటువంటి సాత్త్వికజీవితం గురించి మాట్లాడేడో అటువంటి జీవితం జీవిస్తున్నవాళ్ళు నా సమకాలికుల్లో జయతి, లోహి. వారికి ఈ పుస్తకం కానుక చేస్తున్నాను.
ఈ పిడిఎఫ్ మీరు ఫోన్లో, టాబ్ లో, సిస్టమ్ లో ఎక్కడేనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ స్నేహితులకీ, యువతీ యువకులకీ మెయిల్లో గాని లేదా వాట్సప్ లో గాని, మీ శుభాకాంక్షల్తో పంపిస్తే, ఈ ఆలోచనలు మరొక పదిమందికి చేరితే నాకు సంతోషమనిపిస్తుంది.
16-11-2022


Good efforts to propagate sathiivk life
Thank you very much madam!
Thank you very much sir.
ధన్యవాదాలు
Sir, సెనేకా, ఎపిక్టేటస్ గురించి రచనలు రూపంలో వివరించ గలరు 🙏🙏🙏… నీ శిల్పివి నువ్వే బుక్ ద్వారా మార్కస్ అరేలియాస్ మెడిటేషన్స్ ని సరళంగా వివరించినందుకు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
సెనెకా పైన కొన్ని వ్యాసాలు రాశాను. ఎపిక్టెటస్ పైన రాయవలసి ఉంది.
సెనెకా పై వ్యాసాలు link ఇవ్వగలరు 🙏
నా బ్లాగులో సెర్చ్ ఆప్షన్ లో సెనెకా ఉత్తరాలు అని టైప్ చేస్తే వరుసగా వస్తాయి.
Sir, Marcus areluis meditations మొత్తం పుస్తకం తెలుగు అనువాదం ఎక్కడ అయినా వుంటుందా సార్
ఇప్పటిదాకా ఎవరూ తెలుగులో పూర్తిగా అనువాదం చేయలేదు.