వడ్డాది పాపయ్య

ఆ చిత్రాన్నట్లానే చాలాసేపు తదేకంగా చూస్తూండిపోయాను. ఆ పడుచుని చిత్రిస్తున్నప్పుడు చిత్రకారుడు ఆమె యవ్వనం మీద కన్నా ఆమె ముగ్ధత్వం మీదనే దృష్టిపెట్టాడని తెలుస్తూ ఉండింది.

మాకొద్దీ తెల్లదొరతనమూ

ఆ రాత్రి విజయవాడకు తిరిగివస్తున్నంతసేపూ ఆ ఉద్యమకారులు, సంస్కర్తలు నా మనసులో పదేపదే మెదుల్తూ ఉన్నారు. అటువంటి చారిత్రాత్మక కళాశాలకు నేనేమి చెయ్యగలనా అని ఆలోచిస్తూ ఉన్నాను.

రెల్లు, రెల్లు, రెల్లు

కృష్ణప్రేమికులు ఆ రెల్లు గడ్డిని తలుచుకుని ఎందుకంత వివశులైపోతారో అర్థమయింది. చూడగా చూడగా ఆకాశం రెల్లుని పూసిందనీ, నదులూ, వాగులూ, వంకలూ, నెర్రెలూ, దొరువులూ మేఘాల్ని పూసాయనీ గ్రహించాను.