మగత్తాన ఆసిరియర్

, నాలోపలి మనిషిని పట్టుకునే ప్రయత్నంలో నేను కవిత్వం రాస్తున్నాను. ఆ లోపలి మనిషి నా బయటి జీవితపు 'నేను' కాదు. కాని నా బయటి జీవితం లేకపోతే ఆ లోపలి నేను కూడా లేడు. అంటే నేను నా బయటి జీవితం ఆధారంగా ఆ లోపలి 'నేను ' ని పట్టుకోవడం ద్వారా మీ లోపలి 'నేను' కి connect అయి మీకందరికీ చేరువకావాలన్నదే నా తపన

తమిళ మిత్రుల స్పందన

కాని నా కవిత్వం మీద చర్చగా మొదలయింది కాస్తా తెలుగు సాహిత్యం మీదా, సమకాలిక తెలుగు, తమిళ సాహిత్యాల మీదా చర్చగా మారిపోయింది. కేటాయించిన గంట సమయం దాటి గంటన్నరదాకా మిత్రులు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.

వంజంగి

వచ్చే ముందు మళ్ళా ఒకసారి ఆ మహాపర్వతశ్రేణిని, ఆ రజతశృంగ నిశ్రేణిని తనివితీరా చూసాను. దేవాలయంలో ధూపమూ, హారతీ ఇచ్చి అర్చన పూర్తయ్యాక తృప్తిగానూ, నిశ్శబ్దంగానూ నిలిచి ఉండే మూలవిరాట్టుల్లాగా ఉన్నాయి ఆ కొండలు. ఈ రోజుకి ధ్యానం, సంధ్యావందనం మాత్రమే కాదు, పూజ కూడా పూర్తయిందనిపించింది.