Poem of Pity

Reading Time: 2 minutes

The cow is a poem of pity
MK Gandhi
 
Our cow was beaten, and Mom shed tears.
But why feel upset?
 
The famished land is crowded with barren cows.
Skeletons groaning in a desolate land,
Poor mothers with withered abdomens pray for the health of their husbands,
Destitute kids with unkempt hair carry the burden of the planet.
 
Yet,
Poets never stop praising the nation,
Leaders are not tired of signing declarations of peace.
Elections never stop.
Entertainment doesn’t stop, dinners don’t stop, and
Discussions don’t stop.
 
Brother,
You say this is all a conspiracy. I disagree.
I believe they don’t know what they’re doing.
(My God, my God, why have you forsaken me?)
In my country, one does not have to mourn the dead.
Let us lament for the living and their children.
 
Historians will not allow the history to die
And, no one helps the starving survive.
 
Cry, my beloved country.
Living here is more than a poem of pity.
 
As we assassinate both God and man,
Cry, since we don’t know what we do.
Until fire and brimstone rain, cry.
Cry aloud that the barren are blessed, and
Cry until the guns sprout from the ground.
 
Body be bread,
Blood be wine,
Cry until your hunger subsides,
Cry, cry and cry.
 
~
 
POEM OF PITY
 
Cow is a poem of pity – MK Gandhi
 
ఆవు కాలు విరిచేసారని అమ్మ కన్నుల్లో నీళ్ళు.
కాని ఎందుకు శోకించడం?
నిత్యం ఎండిపోయిన డొక్కల్తో ఆవులు బంజరలో తిరుగుతూనే ఉన్నాయి.
బీళ్ళువారిన పొలాల్లో కంకాళాలు మూలుగుతూనే ఉన్నాయి.
ఒడిలిపోయిన పొత్తికడుపు తల్లులు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూనే ఉన్నారు.
చింకి తలల పసిపాపలు తమ శాపగ్రస్త హస్తాల్తో భూమిని మోస్తూనే ఉన్నారు.
 
అయినా సరే-
కవులు దేశాన్ని కీర్తించడం మానరు.
నేతలు శాంతి ప్రకటనలు చెయ్యడం మానరు.
ఎన్నికలు ఆగవు.
సభలు ఆగవు, విందులు ఆగవు, వినోదాలు ఆగవు.
 
తమ్ముడూ!
నువ్వు ఇదంతా కుట్ర అంటావు, నేనలా అనుకోను.
వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకే తెలీదంటాను
(దేవా, దేవా, నా చేతిని ఎందుకు విడిచావు?)
ఈ దేశంలో చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడవనక్కర్లేదు.
బతికున్నవాళ్ళకోసం, వాళ్ళ బిడ్డలకోసం మాత్రమే ఏడవాలి.
అశోక ధర్మచక్రాల్నీ, దీన్ ఇల్లాహీల్నీ చరిత్రకారులు చావనివ్వరు,
అన్నంలేక చస్తున్న వాళ్ళని ఎవరూ బతకనివ్వరు.
 
ఏడవండర్రా, ఏడవండి.
నా దేశంలో బతకడమే ఒక శోకగీతం.
దేవుణ్ణీ, మనిషినీ కూడా వధిస్తున్న వాళ్ళం.
ఏం చేస్తున్నామో తెలియకుండా ఏడవండ్రా ఏడవండి.
గంధకమూ, అగ్నీ వర్షించేదాకా ఏడవండి,
పిల్లలు లేని గొడ్రాళ్ళే నయమనిపించేటట్లు ఏడవండి.
నేలని చీల్చుకుని తుపాకులు చిగురించేదాకా ఏడవండి.
 
దేహాలు రొట్టెలుగా,
రక్తం మధువుగా,
ఆకలి తీరేదాకా ఏడవండి! ఏడవండి! ఏడవండి!
 
16-3-1986
 
From Nirvikalpa Sangitam, 1986

Translated by poet.

One Reply to “Poem of Pity”

  1. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఇంత ఆర్ద్రంగా కవిత్వం రాస్తారా?
    మీ ఎంపికకు అభినందనలు.
    ఈ కవిత చదువుతోంటే శ్రీ రంగం ఆలయంలో డొక్కలు ఎండిన గోవుల ‘శాల’
    పునః ప్రత్యక్షమైంది.

    వట్టిపోయిన ఆవులను ఆలయానికి రైతులు చవకగా అమ్ముతారు.
    గోదానం మొక్కుకున్న భక్తులు బేరమాడి కొంటారు.
    మొక్కు పూర్తి కాగానే వెంటనే గోశాలకు చేరతాయి.
    తిరుప్పావైలు రోజూ వింటున్నా
    ఆ ఆవులను పట్టించుకోవాలనే స్పృహే
    హృదయాలకు చేరదు కదా!
    తిరుమల గోశాలల్లో ఆవులు పుష్టిగా ఉంటాయి.

    మన్నిస్తే :
    ‘ఆవు కాలు విరిచేసారని’ కంటే ‘మన ఆవును కొట్టారని’ సామూహిక ఆర్తి గా ధ్వనిస్తుందేమో.

    ధన్యవాదాలు.

    – పున్నా కృష్ణమూర్తి

Leave a Reply

%d bloggers like this: