Sangita Ghosh

Reading Time: 2 minutes

H

 
 
As the evening sunlight flooded the theatre corridors
You appeared before me like a sacred song amid the throng.
And smiled at me as if you were aware of the entire play.
 
One night, I dreamed of a girl with a womb
Covering a mysterious light with transparent layers.
It was loathing.
 
Scratching somewhere in secret, she evoked a soft pain.
Then rubbed the sticky morals that oozed out of her hair
And disappeared.
 
In my ancient village, the ritual dance continued.
After knocking over a row of shining limbs,
When I reached the door meant for me,
You took me into your arms and caressed me.
 
The wild beating of the drums, your possessed body,
Chanting in the air, reddened eyes, and loosened tresses-
You know me more that I know myself.
 
You sent me your wedding card
in response to the letters that
I’ve been writing for years.
The poor corpse, that it addressed,
Is now being pulled by fishermen on unknown shores.
 
Tidying your saree, leaning over the balustrades,
You ask me when to come home?
If so, who is it I undress, cling to,
and cry over every night in my room?
 
You return both my gifts and grief, saying idol worship is wrong.
Then, stepping back in humility,
You suggest that I should better seek a Guru.
 
Are you a blessing or a curse,
I wonder.
 
 
సంగీతా ఘోష్
 
సాయంసంధ్యా రశ్మి కారిడార్ లో పరుచుకున్నప్పుడు థియేటర్లో
తొక్కిసలాడుతున్న మనుషుల మధ్యనుంచి పవిత్ర ప్రవచనంలా కన్పించావు.
జరుగుతున్న నాటకమేమిటో ఎరిగినదానిమల్లే మెత్తగా చిరునవ్వావు.
 
ఒక రాత్రి
కలలో, ఎవరో అమ్మాయి, గుహ్యమైన కాంతులపైని పారదర్శకపు పొరలు కప్పి
ఎత్తుగా ఉబ్బిన ఊంబుతో-
వెగటు పుట్టింది,
రహస్యంగా ఏదో గీరి గీరి మెత్తని గుబులు పుట్టించింది, ఇంతలో వెంట్రుకల మధ్య
నుంచి నీతివాక్యాల బంకని అంటించి అదృశ్యమైంది.
 
నా పురాతన గ్రామంలో
సామూహిక బృందగానాల మధ్య నిగనిగలాడే అవయవాల
దొంతర్లమీంచి ప్రతి దేహాన్నీ తట్టి తట్టి చేరాల్సిన ద్వారం
దగ్గరికి చేరే సరికి ‘ నా తండ్రీ’ అంటో నువ్వు. డప్పుల
హోరుమధ్య, రెపరెపలాడుతున్న ప్రభల నీడల్లో పూనకంతో ఊగిపోయిన
నీ ఒళ్ళు, ఎర్రబడ్డ నేత్రాలు, విరబోసుకున్న శిరోజాలు
నేనేమిటో నాకన్నా నీకే బాగా తెలుసని అప్పుడే నమ్మాను—
 
ఏళ్ళ
తరబడి రాస్తూ ఒచ్చిన ఉత్తరాలకి, ఆక్రందనకి నీ వెడ్డింగ్ కార్డ్
జవాబుగా పంపావు. అది ఎవరికి అందాలో వాడి కళేబరాన్ని
ఏ తెలియని తీరంలోనో జాలర్లు ఒడ్డుకి లాగుతున్నారు.
 
పమిట సవరించుకుంటో, బాలుస్ట్రేడ్లని ఆనుకొని
నీ ఇంటికి రావద్దా అని అడుగుతావా? ప్రతి రాత్రీ నా గదిలో
రవికెనీ చీరెనీ వూడదీసి
నేను పట్టుకు ఏడుస్తున్నది ఎవర్నని?
 
ఇంత జరిగినా ద్వేషధూళి
ఆవరిస్తున్న నా ప్రేమపుష్పాన్ని కళ్ళకద్దుకుకొని, నా కాన్కల్ని నాకు తిరిగి ఇచ్చేస్తూ, సద్గురువును వెతుక్కొమ్మని చెప్పి, విగ్రహారాధన మంచిది కాదని వినమ్రంగా తప్పుకుంటావు.
 
నువ్వు నా జీవితానికి ప్రవక్తవో తెలీదు, ప్రచండమైన శాపానివో తెలీదు.
 
14-3-1986
 
Painting: Rabindranath Tagore
 
From Nirvikalpa Sangitam (1986)
Translated by poet.

Leave a Reply

%d bloggers like this: