ఇది నేను ఊహించని అవకాశం. బహుశా హైదరాబాద్ వచ్చినప్పటినుంచి అంతదాకా నేను చూస్తూ వచ్చిన పాఠశాలలూ, హాజరయిన శిక్షణాశిబిరాలూ, డా.సుజాత ఇచ్చిన అవకాశాలూ, జాయ్పుల్లెర్నింగ్ కార్యక్రమం అన్నీ నన్నీ ప్రణాళికా రచనకు సంసిద్ధుణ్ణి చేయడానికీ, అందుకు అవసరమైన సామర్ధ్యాన్ని ఇవ్వడానికీ సంభవించిన అవకాశాలే అనిపించింది.
ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం
ఒక ఉదాత్తదేశం, ఒక ఉదాత్తజాతి ఎట్లా రూపొందగలవనే ప్రశ్నని మేం పదే పదే తరచి తరచి చూశాం. చివరికి మేం చేరుకున్న నిర్ణయమేమిటంటే ఉదాత్తదేశ బీజాలు కుటుంబంలోనే ఉన్నాయని, చక్కటి కుటుంబ వాతావరణంలో పెరిగి పెద్దవాడైన వ్యక్తి మాత్రమే జాతి పట్ల తన బాధ్యత గుర్తుపట్టగలుగుతాడు
