ప్రకాశిస్తూనే ఉంది ఈ సమస్త ప్రపంచం ఎడతెగకుండా, ఎక్కడా తెంపులేకుండా! ఆహా! ఎటువంటిది ఈ మాయ! రెండనీ రెండుకాదనీ భ్రమలు కల్పిస్తూనే ఉన్నది.
అవధూత గీత-8
ఈ ప్రపంచం మొత్తం నిరాకారమని తెలుసుకో ఈ ప్రపంచం మొత్తం వికారహీనమని తెలుసుకో ఈ ప్రపచం మొత్తం విశుద్ధదేహమని తెలుసుకో ఈ ప్రపంచం మొత్తం శివైకరూపమని తెలుసుకో.
అవధూత గీత-7
సాకారమేదీ సత్యం కాదని తెలుసుకో, నిరాకారమొకటే నిరంతరం ఈ తత్త్వం తెలుసుకున్నావా, నువ్వు మళ్ళా ప్రభవించడముండదు.
