ఆ వెన్నెల రాత్రులు-24

ఆ రోజు కొండపైదాకా ఎక్కాం. అప్పుడు కూడా సాయంకాలమవుతూ ఉంది. ఆ కొండమీంచి చూస్తే దిగంతందాకా ఆకుపచ్చని సముద్రం, ఆ సముద్రం మీంచి పైకి లేస్తున్న ఊదారంగు కెరటాల్లాగా కొండలు. అంతదాకా తాను చిటికెనవేలు పట్టుకుని నడిపిస్తున్న తన బిడ్డని తండ్రి ఒక్కసారిగా తన నెత్తిమీద ఎక్కించుకుని చుట్టూ ఎలా ఉందో చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఆ రోజు ఆ కొండమీంచి అప్పటిదాకా నేను తిరుగాడిన దేశం చూస్తే.

ఆ వెన్నెల రాత్రులు-23

వలంటీరింగ్ ఎప్పటికప్పుడు వికసించే ఒక స్పిరిట్. పదవుల్లో ఉన్నవాళ్ళూ, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళూ వలంటీరులు కావడం కష్టం. అలాగే ఎవరో వివేకానందుడూ, గాంధీ లాంటి వాళ్లు తప్ప జీవితకాలంపాటు వలంటీరులుగా ఉండగలిగే వాళ్ళు కూడా అరుదు. ఒక గ్రామం మారాలంటే, ఒక ఉద్యోగి, ఒక సర్పంచ్ వల్ల మాత్రమే ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక ఎక్స్ పర్టూ, ఒక వలంటీరూ కలిస్తేనే అది సాధ్యమవుతుంది

ఆ వెన్నెల రాత్రులు-22

ఒక గంటసేపు ప్రయాణం నడిచేటప్పటికి ఆకాశంలో పాలపుంత అడవిమీదకు ఒరిగిపోయిందా అనిపించింది. అడవికీ, అడవికీ మధ్య ఖాళీగా ఉన్న ప్రదేశాలు వచ్చినప్పుడల్లా, దూరంగా కనిపిస్తున్న కొండల్ని తెల్లటి నిశ్శబ్దం ఆవరించింది. మరికొంతసేపటికి ఆకాశం ఈమూలనుంచి ఆమూలకి ఎవరో పాలకావడి మోసుకుపోతున్నట్టుగానూ, ఆ కావడి నడిచిన దారిపొడుగునా పాలపుంతకి చిల్లుపడి కారిపోతున్నట్టుగానూ ఉంది.