నా కళ్ళ ముందు ఆ ముఖం చెరిగిపోయింది. ఎటు చూసినా పొలాలు. పండిన వరిచేలు. వాటిమీద ఇంతలో ఎండ పడుతోంది, ఇంతలో మబ్బునీడ పడుతోంది. ఇద్దరు పిల్లలు ఆ పొలాల మధ్య గళ్ళకు గంతలు కట్టుకుని ఒకరినొకరు పట్టుకోడానికి పరుగెడుతున్నారు. వాళ్ళిద్దరూ గంతలు కట్టుకున్నారు, లుక్, విమలా, ఇద్దరూ, అంటే నువ్వు కూడా, కళ్ళకి గంతలు కట్టుకున్నావు-
ఆ వెన్నెల రాత్రులు-26
మరేమిటి? జీవితం నీ ఎదట నిల్చొందనీ, రానున్న నీ కాలమంతా ఆ అనుబంధానికే అంకితం కాబోతోందనీ ఏదో స్పష్టాస్పష్టంగా ఉండే ఎరుక. హటాత్తుగా నీ భవిష్యత్తు మీ ఇంటికొచ్చి, మీ వీథి గదిలో కూచుని, 'హలో మిస్' అని పలకరిస్తే, నువ్వు సోఫా లో కాలుమీద కాలు వేసుకుని కూచుని నిదానంగా మాట్లాడగలవా?
ఆ వెన్నెల రాత్రులు-25
ఒక మహావృక్షం మీద ఒక పిట్ట వచ్చి వాలి కొంతసేపు ఆ పూలసుగంధాన్నో, ఆ పిందెల కసరుదనాన్నో రుచిచూసి ఎగిరిపోయిందనుకో, ఆ చెట్టుకి అది తెలుస్తుందా? ఎస్.విమల, బి.ఎస్.సి అనే ఆమె కొన్నాళ్ళు తమ మధ్య సంచరించిందనీ, విభ్రాంతితో అనుదినం తమనే పరికిస్తూ గడిపిందనీ, ఆ పర్వతాలకీ, ఆ అరణ్యానికీ, ఆ గగనతలం మీద సభచేసుకునే నక్షత్రాలకీ గుర్తుంటుందా? అసలు అటువంటి ఒక మనిషి అక్కడికి వచ్చివెళ్ళిందని వాటికి తెలుసా?
