కాళీపట్నం రామారావు మాష్టారి తొంభైవ పుట్టినరోజు. నవతీ తరణం పేరిట విశాఖ పట్నంలో ఈ రోజొక మహోత్సవం జరగనుంది. ఆగష్టు 29, గిడుగు పుట్టినరోజు , తెలుగుభాషోత్సవంగా జరుపుకుంటున్నట్టే, నవంబరు 9 ని తెలుగు కథానికోత్సవంగా జరుపుకోవలసిన రోజు.
బాలాంత్రపు రజనీకాంతరావు
నిన్నసాయంకాలం గుంటూరులో వైశ్య హాస్టల్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున బాలాంత్రపు రజనీకాంతరావుగారికి విశిష్ట సేవా పురస్కారం అందించారు. ఆ సత్కార సభలో రజనీకాంతరావుగారితో వేదిక పంచుకోవడమే కాక, ఆయన గురించి మాట్లాడే అవకాశం కూడా నాకు కలిగింది. మరీ ముఖ్యంగా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారు రజనీకాంతరావుగారిమీద ప్రచురించిన విశేష సంచిక 'రజని ' నీ అవిష్కరించే అదృష్టం కూడ కలిగింది.
డా.నన్నపనేని మంగాదేవి
2016 సంవత్సరానికి గాను జమ్నలాల్ బజాజ్ పురస్కారం డా.నన్నపనేని మంగాదేవికి గారికి లభించిందని తెలిసినప్పటినుంచీ ఆమె దగ్గరకి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటూనే ఉన్నాను. నిన్నటికి ఆ అవకాశం లభించింది.
