అగస్టె రోడె

రోడే తన జీవితకాలం పొడుగునా స్త్రీదేహమనే ఒక రహస్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక విభ్రాంతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి ఫ్రెంచి కెతడ్రల్ కూడా అతడికి మోకరిల్లి ప్రార్థన చేస్తున్న స్త్రీలానే కనిపించింది. ఆ వెతుకులాటలో, ఆ నలుగులాటలో, తన జీవితపు చివరిసంవత్సరాల్లో అతడికి శివుడు కనిపించాడు.

జీన్ లూయీ మొరెల్లి

నీటిరంగుల్ని అసాధారణమైన సామర్థ్యంతో సాధనచేస్తున్న సమకాలిక చిత్రకారులందరిలోనూ జీన్ లూయీ మొరెల్లి కి నేను పెద్ద పీట వేస్తాను.కొన్ని వందల ఏళ్ళుగా చీనా, జపాన్, భారతదేశంలోనూ, గత రెండు శతాబ్దాలుగా బ్రిటన్ లోనూ,అమెరికాలోనూ, వందేళ్ళుగా ప్రపంచమంతటా వికసిస్తూ వచ్చిన ఈ కళా ప్రక్రియను గత పాతికముఫ్ఫై ఏళ్ళుగా మొరెల్లి మనం ఊహించలేని ఎత్తులకి తీసుకుపోతూ ఉన్నాడు.

ట్రెవర్ ఛాంబర్లేను

బ్రిటిష్ చిత్రకారుడు ట్రెవర్ ఛాంబర్లేను నా రోల్ మోడల్స్ లో ఒకరని చెప్పాక, ఆయన గురించి మరొక నాలుగు వాక్యాలు కూడా రాయాలనిపించింది.  ఛాంబర్లేను 1934 లో పుట్టాడు. చిన్నప్పణ్ణుంచీ చిత్రకళ మీద ఆసక్తి ఉన్నప్పటికీ, ఎవరిదగ్గరా చిత్రకళ నేర్చుకోలేదు. స్వయంకృషితోటీ, పూర్వ బ్రిటిష్ చిత్రకారుల్ని అధ్యయనం చెయ్యడంతోటీ తనంటన తను చిత్రకారుడిగా మారేడు.