జీవనశిల్పి ఆవిష్కరణ

రవీంద్రకుమార శర్మ గారితో 2010 లో నేను చేసిన సంభాషణల్ని జీవనశిల్పి పేరిట మీతో పంచుకున్నాను. ఆ సంభాషణల్ని పుస్తక రూపంగా కూడా ఈ-బుక్ గా మీతో పంచుకున్నాను. శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు ఆ సంభాషణల్ని పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ రోజు సాయంకాలం అదిలాబాదులో కళాశ్రమంలో ఆ పుస్తకాన్ని గురూజీ శ్రీమతి రాజశ్రీ శర్మగారు ఆవిష్కరిస్తున్నారు.

ఈ రోజు గురూజీ 75 వ జయంతి. ఆ మహనీయుడికి నివాళి ఘటించడానికీ, ఆ పుస్తకాన్ని కళాశ్రమానికి అంకితం ఇవ్వడానికీ నేను కూడా అదిలాబాదు వెళ్తున్నాను. చాలా ఏళ్ళ తరువాత మళ్ళా అదిలాబాదు ప్రయాణం. నాతో పాటు శ్రీపాద లిటరరీ వర్క్స్ ప్రచురణకర్తల బృందం కూడా అదిలాబాదు వస్తున్నారు.

జీవనశిల్పి పుస్తకం పుటలు 416. వెల రు.500/- పుస్తకం కావలసిన్వారు శ్రీపాద లిటరరీ వర్క్స్ వారిని వాట్సప్ లో 90639 92633 సంప్రదించవచ్చు.

5-9-2026

5 Replies to “జీవనశిల్పి ఆవిష్కరణ”

  1. గురువు గారితో జరిపిన సంభాషణలు జీవనశిల్పి పుస్తకంగా తన 75వ జయంతి రోజు అయిన ఈరోజు ఆవిష్కరణ జరుపుకోవడం చాలా సంతోషం.

  2. Thank you sir, మీ నోట్స్ ఎత్తి రాలేక.. ఇంత పోరాడుతున్నాము ..😊🙏🏻

  3. Many many thanks sir… ఎంతో మంది ఎదురుచూసిన పుస్తకం.., ఆర్డర్ చేసుకున్నాను. ❤️ బడిపిల్లలు కాకుండా గురుపూజోత్సవం నాడు గురువులు గర్వపడే పనిచేసిన వారు మీరొక్కరే కనపడుతున్నారు.

    Your blog is a huge inspiration, sir.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మానసా! నేను వేసే ప్రతి ఒక్క అడుగు వెనక మీ ప్రోత్సాహ వాక్యాలు బలంగా నిలబడి ఉన్నాయి.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading