కొన్ని కలలు కొన్ని మెలకువలు-18

6

ఉద్యమ ఫలితం అంకెల్లో ఉండదు

కర్నూలు అక్షరాస్యతా కార్యక్రమం సఫలమయినట్టా, విఫలమయినట్టా? ఈ ప్రశ్నకి చాలామంది దగ్గర దక్షణ సమాధానముంది. అది విఫలం కావడమే కాదు, దారుణంగా విఫలమయిందని కూడా చాలామంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ సాక్షరతా సమితి దృష్టిలో అదొక ‘దురదృష్టవంతమైన’ (అన్ ఫార్చునేట్) ప్రయత్నం.

ఒకసారి, విద్యావ్యవహారాలు చూసే రాష్ట్రప్రభుత్వకార్యదర్శి అక్షరాస్యతా కార్యక్రమాల మీద చేపట్టిన సమీక్షా సమావేశానికి కర్నూలు కార్యక్రమం తరఫున నేను కూడా హాజరయ్యాను. ఆయన నన్ను మేం చేపట్టిన కార్యక్రమాల గురించి అడక్కుండా ‘కర్నూల్లో ఏం జరిగింది?’ అని అడిగాడు.

అంటే ఆ ప్రశ్నకి అర్ధం ‘మీ కలెక్టర్ అంత అకస్మాత్తుగా బదిలీ అయ్యే పరిస్ధితి ఎందుకు ఏర్పడింది?’ అని అన్నమాట. నేను దానికి సవివరంగానే సమాధానమిచ్చాను గాని, ఆ ప్రశ్న నన్ను చాలా బాధపెట్టింది. విద్యాశాఖ రాష్ట్రకార్యదర్శి జిల్లాలో కార్యక్రమం మొదలయినప్పటి నుంచి ఆ రోజుదాకా కూడా ఒక్కసారి కూడా కర్నూలు రానేలేదు. లేదా వచ్చి వెళ్లినా ఆ సంగతి ఎవరికీ తెలీదు. కనీసం నా వరకూ నాకు తెలియదు. ఆ రోజుల్లో సాక్షరతా కార్యక్రమానికి సంబంధించి ఏ ముఖ్యసంఘటన జరిగి నాకు తెలియకుండా జరిగేది కాదు. అటువంటిది, ఆయన హైదరాబాద్‌లో కూచుని కర్నూల్లో ఏం జరిగింది అని అడగడం నన్ను బాధించింది.

నిజానికి ఆ ప్రశ్నలో ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం కూడా లేదు. అసలా ప్రశ్న సమాధానం కోసంవేసింది కూడా కాదు. కర్నూల్లో ఏం జరిగి ఉంటుందో అప్పటికే ఆయన ఒక నిశ్చయానికి తన మానాన తను వచ్చేసి ఉండాలి. అయినా, ఊరికే ప్రశ్న అడిగాడు, అంతే.

అక్షరాస్యతా కార్యక్రమం విఫలమయిందా? అయితే ఎందుకు విఫలమయినట్టు? ఇవి నిజంగా అర్ధం లేని ప్రశ్నలు. ఎన్నో సార్లు అక్షరాస్యతా కార్యక్రమంలో భాగంగా మేం పదేపదే వేసుకున్న ఈ ప్రశ్నలు. పదే పదే రకరకాలుగా జవాబు చెప్పుకోవడానికి మేం ప్రయత్నిస్తూ వచ్చిన ఈ ప్రశ్నలు నిజంగా అనవసరమైన ప్రశ్నలని ఈ రోజు నేను గుర్తిస్తున్నాను.

పుట్టకముందే మరణించిన కార్యక్రమంగా మేం దాన్ని ఒకప్పుడు భావించాం. ఎన్నో సార్లు దాన్ని తవ్వి తీసాం. పోస్ట్ మార్టం చేసాం. చర్చించి, చర్చించి చివరికి ఆవేదనా భరిత హృదయాలతో మౌనానికి చేరుకునేవాళ్లం.

ఆ కార్యక్రమం విఫలమయిందనే వాళ్లు దేన్ని బట్టి అది విఫలమయిందని అంటున్నారు? దాన్ని ప్రారంభించిన కలెక్టర్ అర్థాంతరంగా బదిలీ అయినందువల్లనా? లేకపోతే ఎర్నాకుళం తరహాలో ఇక్కడ కూడా నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించబడ లేదనా? లేదా ఆ ప్రచార, జన జాగృతి కార్యక్రమాలకి జాతీయ సాక్షరతా సమితి ‘ఎ’ గ్రేడ్ ఇవ్వనందువల్లనా?

అసలు అక్షరాస్యతా ఉద్యమాల నిర్మాణంలోనే చాలా లోపాలున్నాయని కూడా మనం వాదించవచ్చు. అవి పూర్తిగా కలెక్టర్ కేంద్రీయ కార్యక్రమాలుగా నిర్మాణమయ్యాయనీ, ఒక పరిశీలకుడు అన్నట్టుగా వాటిని నిర్వహించడానికి ‘అయితే, పూర్తి శక్తిమంతుడైన కలెక్టర్ గాని లేదా పూర్తి అత్యాశాపరుడైన కలెక్టర్ గాని కావలసిఉంటుందే’ తప్ప వాటిని రుటీన్‌గా అమలు చెయ్యడం అసాధ్యమనీ కూడా మనం వాదించవచ్చు.

అందరూ అనుకుంటున్నట్టుగా కర్నూలు రాజకీయవర్గాలు అక్షరాస్యతకి వ్యతిరేకం కాదనీ, వారి వారి ముఠాతగాదాల కారణంగా ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని కలెక్టర్ మీద చూపించారనీ, అందువల్లనే కలెక్టర్ తనకి ఎంతో ప్రతిష్టగా భావించి ప్రారంభించిన కార్యక్రమాన్ని వారు టార్గెట్ చేసారనీ నా సహచర ఉద్యోగి ఒకాయన అన్నాడు.

ఇది అందరికీ తెలిసిన విషయాన్ని మరోలా చెప్పడానికి ప్రయత్నించడమే. దీనివల్ల అక్షరాస్యతా ఉద్యమం నిర్దోషి అని మనకి మనం మరోమారు చెప్పుకోవడమే. తమ తమ వ్యక్తిగత కక్షలకు అక్షరాస్యతా కార్యక్రమాన్ని టార్గెట్ చెయ్యడంలోనే ఒక ప్రాంతం రాజకీయంగా ఎంత అపరిణతిలో ఉందో, ఎంత సంకుచితశీలంగా ఉందో స్పష్టంగా బోధపడుతూఉంది.

నిజం చెప్పవలసివస్తే అక్షరాస్యతా కార్యక్రమం ఒక కార్యక్రమంగా విఫల మయిందేమో గాని ఉద్యమంగా మాత్రం జయద్రపమయిందనే అనాలి. అసలు అక్షరాస్యతా ఉద్యమాలు (కేరళ, పశ్చిమ బెంగాల్ లను మినహాయిస్తే) ఏ రాష్ట్రంలో నయినా కార్యక్రమాలుగా ఎక్కడయినా జయప్రదాలయ్యాయా అని కూడా ప్రశ్నించవలసి ఉంటుంది.

దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి సాధించిన అజ్మీర్ జిల్లా కార్యక్రమాన్ని పదేళ్ల తరువాత విశ్లేషించి చూస్తే ఆ కార్యక్రమంలో చెప్పుకున్నంత వాసి నిజంగా లేదనీ, అది కలెక్టర్ కింది స్ధాయి ఉద్యోగుల్ని పూర్తిగా నిర్బంధించి చేపట్టిన కార్యక్రమమనీ తెలియవచ్చింది.

పరస్పర విరుద్ధమైన ఈ పరిశీలనల వెనుక అక్షరాస్యతా కార్యక్రమ ఉద్దేశాల్లోని వైరుధ్యమే ప్రతిఫలిస్తూ ఉంది. జాతీయ అక్షరాస్యతా సమితి ఎర్నాకుళం నమూనాను తక్కిన దేశం ముందుకు తెస్తున్నప్పుడు తొలి నాళ్లలో దానిది పరిమితి ఉద్దేశ్యమే. అది పూర్తిగా ‘కాంపెయిన్’ తరహాలో నిర్మాణమైన కార్యక్రమం. అంటే ఉద్యమశీలనిర్మాణ మన్నమాట.

ఉద్యమాల ప్రధానధ్యేయం తమ ప్రజాసమూహాలు కోరుకుంటున్నవాటిని తక్షణమే అందించడం కాదు. అలా చెయ్యడం ఏ ఉద్యమానికి కూడా సాధ్యం కానే కాదు. ప్రధానంగా ఉద్యమాలు నిద్రాణంగా ఉన్న కొన్ని మానవీయ ఆకాంక్షల్ని నలుగురిముందుకీ తీసుకు వస్తాయి.

అలా తీసుకురావడంలో అవి ప్రధానంగా తాము ఏ ప్రజాసమూహాలను ఉద్యమాలను ప్రేరేపిస్తాయో వారే తెలుసుకునేలా చేస్తాయి. అంటే ప్రజాసమూహాలు ఉద్యమాల ఆధారంగా తమలో అణిగిఉన్న మానవీయ ఆకాంక్షల్ని తమకై తామే మొదటిసారిగా బయట పెట్టుకుంటారన్నమాట. తమకై తాముగా తెలుసుకుంటున్నారన్నమాట. తమకై తాముగా చర్చించుకుంటారన్నమాట.

దాని అర్ధం ఆ ఆకాంక్షలు అంతకు ముందు లేవనీ కాదు, లేదా ఆ తర్వాత వారు వాటిని వదిలిపెట్టేసారనీ కాదు. అవి వారిలో ఎప్పుడూ ఉండేవే. అవి బయటనుంచి వచ్చినవయితే వారు వాటినంత ఉత్సాహంగా, సాదరంగా ఆలింగనం చేసుకుని ఉండరు. అవి వారి ఆకాంక్షలు కాబట్టే, అవి బయటకు రావడంలో వారొక అద్వితీయ విమోచనను అనుభవిస్తున్నారు కాబట్టే వారా మానవీయ ఆకాంక్షలను అంత మమతగా హృదయానికి హత్తుకుంటారు.

మరి మామూలు సమయాల్లో ఆ ఆకాంక్షలు ఎక్కడికి పోయినట్టు? అవి మామూలు సమయాల్లో సాంఘిక-సాంస్కృతిక పరిమితులకూ, నిర్బంధాలకూ అణగిఉంటాయి. వాటిని ధిక్కరించే మనస్ధితి లేనట్టుగా పక్కకి ఒదిగి పడిఉంటాయి. అననుకూల పరిస్ధితుల్ని ఛేదించే శక్తి సామర్ధ్యాలు తమకి లేవన్న నమ్మకంతో మౌనంగా నిద్రిస్తూఉంటాయి. చదువుకోవాలి. విద్యావంతులు కావాలి అనేది అటువంటి నిద్రాణ, మహా మానవీయ ఆకాంక్షల్లో ఒకటి.

అక్షరాస్యతా ఉద్యమాన్ని ‘కాంపెయిన్’ తరహాలో ముమ్మర కార్యక్రమంగా నిర్మించినప్పుడు ఎర్నాకుళం నమూనా సాధించిందేమంటే అటువంటి నిద్రత, అంతదాకా అప్రధానంగా భావించబడుతూ వస్తున్న అక్షరకాంక్షను పైకి తట్టిలేపడమే. మరే జిల్లాలోనైనా సరే ఆ నమూనానుసరించి అటువంటి జాగృతి సంభవించిందంటే ఆ మేరకు ఆ జిల్లాలో ఆ కార్యక్రమం పూర్తిగా జయప్రదమయినట్టే.

అటువంటి జాగృతి కర్నూలు జిల్లాలో కూడా సంభవించడాన్ని నేను కళ్లారా చూసాను కాబట్టి ఆ మేరకు కర్నూలు జిల్లాలో కూడా అక్షరాస్యతా ఉద్యమం జయప్రదమయిందనే నేను భావిస్తున్నాను.

ప్రజాసమూహాల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమంలో జాగృతపరచడం మొదటి మెట్టు. జాగృతి వెనక సంఘటనా కార్యక్రమం మొదలుకావాలి. ప్రజాశ్రేణుల్ని సంఘటితం చెయ్యడం జాగృతపరచడమంత సులభం కాదు. లేదా అది వివిధ దేశాల్లో విప్లవకాలాల్లోనూ, మన దేశంలో జాతీయోద్యమకాలంలోనూ జరిగినట్టుగా రాజకీయపార్టీలు వివిధ శాఖల ద్వారా ప్రజాశ్రేణుల్ని సమాయత్తం చేయగలగడమూ  కాదు. ప్రజాశ్రేణుల్ని సంఘటిత పరచడం అనేక పొరల్లో, అనేక తలాల్లో, అనేక స్ధాయిల్లో జరుగుతూ రావలసిన కార్యక్రమం.

దానిలో వివిధ విద్యా, సాంఘిక, సాంస్కృతిక, మతధార్మిక, ఆర్ధిక కార్యక్రమాల సారాంశం ఇమిడి ఉంటుంది. ఒక ప్రజాసమూహపు రాజనైతిక వ్యక్తీకరణ అటువంటి సారాంశంలోంచే ఉత్పన్నమవ్వాలి, న్యాయంగా.

అలా చూసినట్టయితే, ఎర్నాకుళం విజయం వెనుక కేరళ ప్రాంతపు సామాజిక-సాంస్కృతిక నేపథ్యానికీ, కర్నూలు సామాజిక-సాంస్కృతిక నేపథ్యానికీ మధ్య ఎంతో వ్యత్యాసముంది. ఈ మాట కూడా చాలామంది చెప్పారు. అక్షరాస్యతా ఉద్యమం ప్రజా సంఘటనగా పరిణమించాలంటే ఆ ప్రాంతంలో వివిధ సాంఘిక-సాంస్కృతిక ఉద్యమాల ప్రభావం ఉండాలనీ, ఆ ప్రభావం వల్ల ఆ ప్రాంతపు రాజకీయ శక్తులు మానసికంగా పరిణతి చెందవలసిఉంటుందనీ నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు.

కానీ, ఇక్కడ గమనించవలసిందేమంటే, ఒకవేళ అటువంటి అనుకూల పరిస్ధితులు వెంటనే లేకపోయినప్పటికీ, ఆ ఉద్యమాలు విఫలమయినట్టు కాదనే. ఆ ఉద్యమాల వల్ల బయటికి వ్యక్తమయిన ఆకాంక్షలు ఇంకా కేవలం ఆకాంక్షలుగానే ఉండవు. అవి వివిధ రూపాలు ధరిస్తాయి.

ఒక్కొక్కప్పుడు ఆయా ప్రాంతాల సాంఘిక-ఆర్ధిక పరిస్ధితులననుసరించి ఆ రూపాల తక్షణ వ్యక్తీకరణ మనకి స్పష్టంగా కనబడవచ్చు. అందరూ తరచూ ప్రస్తుతించే నెల్లూరు అక్షరాస్యతా కార్యక్రమం ఇందుకు చక్కని ఉదాహరణ. అక్కడ అక్షరాస్యతా ఉద్యమం మహిళలు తమ ఆకాంక్షలను పంచుకోవడానికొక వేదికగా సమకూరింది. ఆ ఆసరాగా అక్కడ సారావ్యతిరేకోద్యమం ప్రభవించింది. మద్యవ్యతిరేకోద్యమం నుంచి లభించిన పొదుపు ఆధారంగా పొదుపులక్ష్మి ఉద్యమం బలపడింది.

అటువంటి వ్యక్తీకరణలు అన్ని ఉద్యమాలకూ తక్షణమే రావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ముఖ్యంగా చెప్పుకోదగ్గ సామాజిక-సాంస్కృతిక ఉద్యమాలుగాని, సంస్ధలుగాని లేని కర్నూలు జిల్లాలో అక్షరాస్యతా జాగృతి తక్షణమే ప్రజాసంఘటనగా మారుతుందని అస్సలు భావించలేం.

అలాగని కర్నూలు అక్షరాస్యతా కార్యక్రమాన్ని రాజకీయశక్తులు వెన్నుపోటు పొడిచాయనడం కూడా పాక్షికసత్యమే. తమ ప్రజల ఆకాంక్షల్ని పసిగట్టలేని ఏ శక్తిని మనం దాని నిజమైన అర్ధంలో రాజకీయశక్తిగా పిలవలేం. ఆ రకంగా చూస్తే అప్పటి కర్నూలు రాజకీయశక్తులు రెండు సార్లు విఫలమయ్యాయని చెప్పాలి.

మొదటిది, ఎవరో కలెక్టర్ వచ్చి చెప్పిందాకా తమ ప్రజలకి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉందని ఆ శక్తులు తమంత తామే తెలుసుకోలేనప్పుడు. ఇక రెండవ వైఫల్యం, తమ ప్రజల ఆకాంక్షల్ని మేల్కొల్పడానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఆ కలెక్టర్‌ని బదిలీ చేయించడం ద్వారా భగ్నం చెయ్యాలనుకున్నప్పుడు.

ఆ రెండు సందర్భాల్లోనూ కూడా కర్నూలు రాజకీయశక్తులు చూపిన అపరిణత మనస్కతని బట్టి రాజకీయంగా కర్నూలు ఇంకా పరిణతి చెందలేదన్నదే తేటతెల్లమవుతూ ఉంది. అటువంటి రాజకీయ పరిణతి లేకపోవడం వెనక ఆ ప్రాంతపు సామాజిక-సాంస్కృతిక వెనకబాటుతనం కూడా మనకి ప్రస్ఫుటమవుతూనేఉంది. తనని, తన కార్యక్రమాన్ని బలపరిచే సామాజిక-సాంస్కృతిక నేపథ్యం లేని పరిస్ధితుల్లో కలెక్టర్ తన ప్రణాళిక నిర్వహణకు అధికారవర్గాల మీద ఎక్కువ ఆధారపడ్డాడు.

బ్యురాక్రసీ సహజంగా ఉద్యమశీలత్వానికి వ్యతిరేకమైంది. అది యంత్రాంగం. యాంత్రిక విధినిర్వహణ కోసమే అది తర్ఫీదయిఉంది. వీలయినంతవరకూ అది యథాతథ స్ధితిని కొనసాగించాలనే అనుకుంటుంది. ఉద్యమాలు అలా కాదు. అవి సృజనశీలాలు, గతిశీలాలు. ప్రస్తుతం నెలకొని ఉన్న స్ధితి పట్ల అసంతృప్తి లేకుండా, ఆ స్ధితినుంచి ఎటో ఒక వైపు జరగాలనుకోకుండా ఏ ఉద్యమమూ  ప్రభవించదు. కాబట్టి బ్యూరాక్రసీ ద్వారా ఉద్యమనిర్మాణం చెయ్యడం సాధ్యమయ్యే పనికాదు.

ఈ నేపథ్యంలో కర్నూలుకీ, నెల్లూరుకీ మధ్య ఉన్న తేడాని కూడా మనం చూడాలి. నెల్లూరులో అత్యధికభాగం బహుశా పందొమ్మిదో శతాబ్ది నుంచి ఇరవయ్యవ శతాబ్దికి పరివర్తన చెందుతూ ఉండవచ్చు.

కానీ దాదాపుగా మొత్తం కర్నూలు (కర్నూలు పట్టణంతో సహా) ఇంకా పందొమ్మిదో శతాబ్దిలోనే జీవిస్తోందని మనం గ్రహించాలి. అయినప్పటికీ కర్నూలు కార్యక్రమంలో మొదటి మూడునెలల్లో తన యంత్రాంగం ద్వారా కలెక్టర్ ఎవరూ ఊహించలేనంత అపూర్వ జనస్పందననని రేకెత్తించగలిగాడు.

ఆ అర్థంలో కర్నూలు అక్షరాస్యతా ఉద్యమం నిజంగా జయప్రదమైందనాలి.

అటువంటి జనస్పందన జనసంఘటనగా రూపుదిద్దుకోకపోవడానికి కర్నూల్లో చెప్పుకోదగ్గ సామాజిక`సాంస్కృతిక ఉద్యమాల నేపథ్యం లేకపోవడం, కార్యక్రమం పూర్తిగా బ్యురాక్రసీ చేతుల్లోనే ఉండటంతో పాటు జాతీయ సాక్షరతా మిషన్ దృక్పథపరిమితి కూడా కారణమని చెప్పవలసిఉంటుంది.

జాతీయ సాక్షరతా సమితి తన కార్యక్రమాన్ని ‘కాంపెయిన్’ తరహాలోనే నిర్మించినప్పటికి దాని లక్ష్యాలుగా ఉద్దేశించుకున్న అంత్య ఫలితాలు మాత్రం తిరిగి బ్యురాక్రటిక్ తరహాలోనే అంకెలసంకెలగానే మారిపోయాయి. నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఉద్యమ నిర్మాతా కూడా తన ఉద్యమ ఫలితాలుగా అంకెల్ని నిర్ణయించుకోలేదు. అటువంటి పొరపాటు ఒక్క సాక్షరతా ఉద్యమంలోనే నాకు కనబడింది.

ఒక జిల్లాలో లేదా ప్రాంతంలో సాక్షరతా ఉద్యమం సఫలమయిందా లేదా అన్నది చూడటానికి అంకెల్ని దాటిన కొలమానాల్ని సాక్షరతా మిషన్ రూపొందించుకుని ఉండవలసింది. అంతేకాక ప్రతి ప్రాంతంలోనూ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందే ఆయా కొలమానాల ప్రకారం బెంచి మార్కుల్ని గీత గీసుకుని ఉండవలసింది. అప్పుడు ఆ కార్యక్రమం అక్కడ జయప్రదమయిందో లేదో స్పష్టంగా తెలిసిఉండేది.

తన లక్ష్యాలు యాంత్రికంగా, తన మూల్యాంకనా పద్ధతులు యాంత్రికంగా ఉండగా కేవలం తన ఎత్తుగడల్ని మాత్రమే వ్యూహాత్మకంగా ఉద్యమశీలాలుగా మార్చినందువల్ల అద్భుతాలేమీ జరగబోవని సాక్షరతా మిషన్ ఈ పాటికైనా గ్రహించిఉంటుంది.

అన్నిటికన్నా పెద్ద పరిమితి అక్షరాస్యతా ఉద్యమం తన లక్ష్యంగా ఒక కనీస నైపుణ్యాన్ని నిర్ణయించుకోవడమే. అది వయోజన విద్యను చివరికి ‘కనీస అక్షరాస్యతా కార్యక్రమం’గా మార్చేసింది. బహుశా అతి తక్కువ కాలంలో ఉద్యమస్ధాయిలో అత్యధిక సంఖ్యాకులకు కేవలం కొన్ని నైపుణ్యాల్ని మాత్రమే అందించగలమని అది భావించిఉండవచ్చు.

కానీ, ఆ కొన్ని ‘కనీస నైపుణ్యాల్ని’ అంటి పెట్టుకుని విస్తృత సామాజిక`రాజకీయ చైతన్యం ఉండితీరకతప్పదని అది గ్రహించిఉండాలి. తక్కిన దేశంలోని పరిస్ధితుల్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే ఎర్నాకుళాన్ని దేశం మొత్తానికి ప్రాతినిధ్య నమూనాగా భావించలేం. దానికి బదులుగా, బీహార్ లేదా ఉత్తరప్రదేశ్ లేదా ఛత్తీస్‌గడ్ లోని ఏదో జిల్లాలో అక్షరాస్యతా కార్యక్రమం మొదలయి ఆ నమూనాను తక్కిన దేశం పాటించిఉండి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండిఉండేవని నిస్సందేహంగా చెప్పగలను.

1991లో నూటికి 86 మంది స్త్రీలు అక్షరాస్యులుగా ఉన్న కేరళలో నూటికి నూరుశాతం అక్షరాస్యత ఆచరణాత్మక లక్ష్యం. అక్కడ అక్షరాస్యతా ఉద్యమాల వాతావరణ నిర్మాణానికి ఆరునెలల వ్యవధి సరిపోవచ్చు. కాని నూటికి 37 మంది స్త్రీలు మాత్రమే అక్షరాస్యులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నూటికి నూరు శాతం అక్షరాస్యతను ఆరునెలల్లో సాధించాలనుకోవడం నిస్సందేహంగా నేలవిడిచిన సాము.

అంతేకాక, కేరళలోలానే ఇక్కడ కూడా ఆరునెలల్లో ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేయగలమనుకోవడం (కర్నూలు విషయంలో అది ఆరునెలలు కూడా కాదు. నాలుగు నెలలే) స్పష్టంగా అత్యాశ.

జాతీయ సాక్షరతా సమితి వ్యూహంలోని ఈ వైరుధ్యాన్ని విశ్లేషిస్తూ ఒక విద్యావేత్త ఇలా రాసింది:

(అనిత దీఘె, సోషల్ మొబిలైజేషన్ అండ్ టోటల్ లిటరసీ కాంపెయిన్స్, ఇండియా ఎడ్యుకేషన్ రిపోర్ట్, ఆక్స్ ఫర్డ్, 2002)

పై వాక్యాల్లోని పరిశీలనల్ని నేను అంగీకరిస్తూనే, ఆ పరిశీలనల్లో కూడా కొంత గతిశీలత లోపించిందనుకుంటున్నాను. పై వాక్యాలు రాజ్యాన్నీ, సైద్ధాంతిక భావజాలాన్నీ ఎదురెదురుగా స్ధితిశీలతలో పెట్టి మాట్లాడుతున్నట్టుగా ఉంది.

నిజానికి రాజ్యం ఏ సమాజానికైనా రాజకీయవ్యక్తీకరణ మాత్రమే. రాజ్యంకన్నా ప్రజల ఆకాంక్షలు మరింత బలమైనవి. వాటిని ఏ రాజ్యం కూడా ఎల్లకాలం అణచి వెయ్యలేదు. లేదా అణచి ఉంచిందను-కుంటున్నప్పుడు కూడా నిజానికి అవి వికసిస్తూనే ఉండిఉండవచ్చు కూడా. ఎవరు చెప్పగలరు?

నిజమే, నెల్లూరులో రాజ్యం అక్షరాస్యతా ఫలితాల్ని అణచివేసాననే అనుకుని ఉండవచ్చు. కాని అది అక్షరాస్యతా ఉద్యమాన్ని అణచగానే సారా వ్యతిరేక ఉద్యమంగానూ, సారా వ్యతిరేకోద్యమాన్ని అణచగానే పొదుపు ఉద్యమంగానూ వికసిస్తూ వచ్చింది. నిజమే, కర్నూల్లో అక్షరాస్యతా ఉద్యమం అక్షరాభ్యాసానికి ముందే అణచివేతకు గురయిఉండవచ్చు. అది మళ్లా వెంటనే మరొక ఉద్యమంగా తలెత్తకపోయిఉండవచ్చు.

కాని నేడు రాష్ట్రమంతటా వెల్లువగా విరుచుకుపడుతున్న మహిళా సాధికారికతా ఉద్యమానికి పుట్టినిల్లు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలమేననని మనం గుర్తు పెట్టుకుంటే దాని వెనుక అక్షరాస్యతాఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి ఉందన్న సత్యాన్ని మనం కాదనలేం. ఆ అక్షరాస్యతా ఉద్యమం అక్కడ ఆ మేరకన్నా జయప్రదం కావడం వెనుక  ఎన్నేళ్ళకిందటనో ఆ జిల్లాలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఉండి ఉండేవాడన్నది కూడా  మరవలేం.

నేడు నెల్లూరు జిల్లాలోని పొదుపు ఉద్యమంకూడా అంతిమంగా మహిళా సాధికారికతా ఉద్యమంగానే రూపుదిద్దుకొంటోందని మనం గ్రహించినట్లయితే, రెండు జిల్లాల అక్షరాస్యతా ఉద్యమాలూ ఇప్పటికి ఒకే రూపుధరించాయని మనం సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఇవి కూడా తాత్కాలిక రూపాలే. భవిష్యత్తులో ఇవి ఎటువంటి విమోచనోద్యమాలుగా రూపుదిద్దుకోబోతున్నాయో ఎవరికి తెలుసు?

6

Beyond Numbers and Statistics

Was the Kurnool Total Literacy Campaign a success or a failure? Most people possess a swift and ready answer to this question. Many are prepared to declare that it not only failed, but failed catastrophically. In the official eyes of the National Literacy Mission, it was categorized as an “unfortunate” attempt.

On one occasion, I attended a state-level review meeting chaired by the Secretary of Education to represent the Kurnool campaign. Instead of inquiring about the programs we had executed on the ground, he looked at me and asked, “So, what exactly happened in Kurnool?”

The implicit meaning of his question was obvious: Why did a situation arise where your Collector had to be removed so abruptly? Though I offered him a detailed explanation, his question wounded me deeply. From the day the campaign was launched until that review meeting, the Education Secretary had not set foot in Kurnool even once—or if he had visited, no one in the district was aware of it. At the time, no significant development regarding the literacy campaign escaped my notice; that he should sit in his office in Hyderabad and casually ask what happened in Kurnool was deeply painful.

In truth, his inquiry carried no genuine curiosity, nor was it asked in search of an answer. He had already arrived at his own private conclusions regarding Kurnool. He merely posed the question in passing, nothing more.

Did the literacy campaign truly fail? And if it failed, why did it fail? Today, I recognize that these are essentially meaningless questions. During the campaign, we put these very queries to ourselves repeatedly, striving in vain to answer them in various ways. But I see now that they were unnecessary questions to begin with.

For a long time, we viewed the campaign as an initiative that had died before it was born. We exhumed it repeatedly, conducted administrative post-mortems, and debated its fate until our hearts grew heavy with sorrow and lapsed into quiet silence.

Yet, on what grounds do critics pronounce the campaign a failure? Is it because the Collector who initiated it was abruptly transferred halfway through? Is it because Kurnool did not achieve one hundred percent literacy on the Ernakulam model? Or is it because the National Literacy Mission declined to award our public mobilization campaign an ‘A’ grade?

One could certainly argue that structural flaws were embedded within the design of such literacy campaigns from the outset. They were constructed entirely as Collector-centric endeavors; as one acute observer remarked, executing them required either an extraordinarily powerful Collector or an immensely ambitious one—making routine administrative implementation virtually impossible.

A fellow officer once suggested that, contrary to popular belief, Kurnool’s political class was not inherently opposed to literacy. Rather, driven by internal factional feuds, they redirected their grievances against the state government onto the Collector, targeting the very project he held most dear.

This argument is merely an attempt to reframe an obvious truth—a way of reassuring ourselves that the literacy movement itself was blameless. Yet, that a region’s political leadership would target a mass educational movement to settle personal grudges only underscores its profound political immaturity and narrow-mindedness.

If we speak truthfully, the campaign may have failed as a formal administrative scheme, but as a popular movement, it achieved resounding success. Indeed, one must ask whether literacy campaigns—with the sole exceptions of Kerala and West Bengal—ever succeeded as formal schemes in any state. A decade after the celebrated Ajmer district campaign in Rajasthan was hailed as a national model, critical analyses revealed that its achievements were far less impressive than claimed, relying heavily on administrative coercion of lower-level staff.

These conflicting evaluations reflect a fundamental contradiction within the goals of the literacy movement itself. When the National Literacy Mission initially presented the Ernakulam model to the nation, its framework was conceived as a high-intensity “campaign”—a temporary, movement-driven surge.

The primary purpose of a social movement is not to instantly deliver material demands to the masses; no movement can accomplish such a feat overnight. Instead, a movement brings long-dormant human aspirations to the surface. In doing so, it enables the community to discover its own latent potential. Through the alchemy of a movement, ordinary people articulate their suppressed human desires for the first time, recognizing their collective strength and debating their destiny amongst themselves.

This does not imply that such aspirations were absent before, or that the people abandoned them afterward. They were always present within them. Had those desires been imposed from the outside, the masses would never have embraced them with such warmth and fervor. Precisely because these were their own deep-seated aspirations, bringing them into the light brought a profound sense of personal liberation, leading them to cradle those human ideals close to their hearts.

Where, then, do such aspirations go during quiet, ordinary times? In everyday existence, they remain muted by socio-cultural constraints and economic anxieties. They lie passive, lacking the immediate resolve to defy hostile circumstances, sleeping silently under the belief that the strength to break through unfavorable conditions is out of reach. The desire to read, to learn, and to become educated is one such dormant, monumental human yearning.

When the literacy movement was structured as an intensive campaign, the true triumph of the Ernakulam model was that it stirred awake this latent thirst for letters—a desire that society had long dismissed as secondary. If such an awakening occurred in any other district following that framework, then to that exact extent, the movement was a genuine success.

Because I witnessed this very awakening unfold before my own eyes across Kurnool district, I hold the firm conviction that our literacy movement was indeed successful.

Awakening public consciousness, however, is merely the initial step. Following that awakening, the far more demanding task of organizational consolidation must begin. Organizing the masses is vastly more complex than merely rousing their spirits. Nor can it be reduced to political parties mobilizing cadre through formal fronts, as occurred during global revolutions or our own National Movement. Mass organization is a multi-layered process that must evolve across many planes and levels over time. It requires weaving together the threads of educational, social, cultural, religious, and economic life, out of which a community’s true political expression naturally emerges.

Viewed from this perspective, a vast gulf separated the socio-cultural landscape of Kerala, which underpinned Ernakulam’s triumph, from the socio-cultural realities of Kurnool. Many observers have noted this contrast. It requires no new argument to state that for a literacy movement to mature into lasting social organization, a region must be fertilized by prior socio-cultural movements that have cultivated political maturity among its leadership and institutions.

Yet, what must be recognized is that even in the absence of such favorable preconditions, these movements cannot be branded as failures. The aspirations brought to light do not simply dissolve back into nothingness; they transform and take on new shapes.

At times, depending on a region’s unique socio-economic soil, these newly awakened energies manifest in immediate, tangible ways. The celebrated Nellore literacy campaign offers a brilliant example of this transformation. There, the literacy centers provided women with a safe, collective space to share their daily grievances and aspirations. That shared bond sparked the historic anti-arrack movement, which in turn birthed the Podupulakshmi micro-savings movement, forever altering the social landscape of the district.

Expecting such spontaneous social expressions to emerge immediately in every movement would be overly ambitious. In a district like Kurnool, which lacked a history of sustained socio-cultural movements or grassroots institutions, one could hardly expect a sudden surge in literacy awareness to translate overnight into organized public mobilization.

Conversely, asserting that local political forces simply backstabbed the campaign is only a partial truth. Any political leadership incapable of sensing the deep-seated aspirations of its own people cannot be called a political force in any true sense. Viewed in this light, the political establishment of Kurnool failed on two distinct counts.

Their first failure lay in their inability to recognize the people’s intense desire for education on their own, requiring an outside Collector to point it out to them. Their second failure occurred when they sought to derail a movement designed to awaken those very aspirations by engineering that Collector’s abrupt transfer. In both instances, the shortsightedness displayed by Kurnool’s political leadership laid bare a profound political immaturity—an immaturity rooted directly in the region’s broader socio-cultural stagnation.

Lacking a supportive socio-cultural framework to reinforce his vision, the Collector was forced to rely almost entirely on the state bureaucracy to execute his blueprint.

Yet, bureaucracy by its very nature is antithetical to the spirit of a movement. A bureaucratic system is a machine, trained solely for the mechanical execution of routine duties and naturally inclined toward preserving the status quo. Social movements, by contrast, are creative, dynamic, and transformative; no movement can ever take root without a divine dissatisfaction with existing conditions and a collective urge to break free from them. Consequently, constructing a genuine social movement through bureaucratic channels alone remains an impossible endeavor.

In this context, the historical contrast between Kurnool and Nellore becomes striking. While Nellore was actively transitioning into the twentieth century, almost the whole of Kurnool—including Kurnool town itself—was still living mentally in the nineteenth century. Nevertheless, through sheer administrative drive, Collector Appa Rao managed to rouse an unprecedented public response across the district during those initial three months—a surge that no observer could have anticipated. In that profound sense, the Kurnool Total Literacy Campaign was a resounding success.

That this extraordinary public awakening failed to consolidate into a lasting social organization was due to three intersecting factors: the absence of a strong socio-cultural movement in the district, total reliance on official bureaucratic machinery, and the narrow vision of the National Literacy Mission itself.

Though the National Literacy Mission originally designed its program in the spirit of a “campaign,” its ultimate measures of success regressed into typical bureaucratic obsession with numerical targets and statistical tables. To my knowledge, no true builder of social movements in human history has ever measured success by abstract figures alone. I witnessed this fundamental misstep only in the Total Literacy Campaign.

The National Literacy Mission should have formulated evaluation metrics beyond mere arithmetic figures to assess whether a literacy campaign succeeded in a given region. Furthermore, it ought to have established clear baseline benchmarks prior to launching the campaign in any district. Only then could the true measure of success or failure have been objectively determined.

The Mission must surely realize by now that when goals and evaluation frameworks remain rigid and mechanical, merely adopting strategic, movement-style tactics cannot produce miraculous social transformations.

The most fundamental flaw lay in defining a narrow, minimum skill level as the primary objective—a compromise that reduced adult education to a minimalist technical exercise. Perhaps the Mission assumed that within a compressed timeframe, a mass movement could impart no more than basic functional skills to large numbers of people. Yet it failed to recognize that even these elementary skills cannot endure in a vacuum; they must be rooted in a broader socio-political consciousness.

Given the socio-economic realities of the rest of India, Ernakulam could never serve as a representative benchmark for the entire nation. Had the Total Literacy Campaign originated instead in a district of Bihar, Uttar Pradesh, or Chhattisgarh, and that model been adapted nationwide, the trajectory of adult education in India would have been radically different.

In Kerala, where female literacy stood at 86 percent in 1991, aiming for total literacy was a practical and achievable goal. A six-month promotional campaign was sufficient to mobilize the public. But in Andhra Pradesh, where female literacy was a meager 37 percent, expecting to achieve total literacy within six months was an absolute illusion. Expecting the populace of Andhra Pradesh—and in Kurnool’s case, within a compressed window of just four months—to achieve what took decades in Kerala was overambitious.

Analyzing this structural contradiction in the National Literacy Mission’s strategy, Dr. Anita Dighe observed:

— Anita Dighe, “Social Mobilization and Total Literacy Campaigns”, India Education Report, Oxford University Press, 2002.

While I concur with Dr. Dighe’s analysis, I believe it lacks a certain dynamic dimension. Her critique sets the state and ideological consciousness against each other in static opposition.

In truth, the state is merely the formal political expression of a society. The living aspirations of a people are far more powerful than the state, and no state apparatus can suppress them indefinitely. Even when a state imagines it has snuffed out a movement, those underlying human energies continue to evolve in secret, unseen ways.

The state machinery in Nellore may well have believed it had contained the political fallout of the literacy campaign. Yet, the moment the literacy movement was curbed, it transformed into the historic Anti-Arrack Movement; and when the Anti-Arrack Movement was suppressed, it re-emerged as the Podupulakshmi micro-savings movement. Similarly, in Kurnool, the literacy campaign may have been cut short even before the formal initiation into letters (Aksharabhyasam), and it did not immediately resurface as a political movement.

Yet, when we observe the powerful wave of women’s empowerment surging across Andhra Pradesh today, and recall that its birthplace was Orvakal mandal in Kurnool district, we cannot deny that the spark was struck by the Total Literacy Campaign. Nor can we forget that behind that initial awakening lay the historic legacy of freedom fighter Gadicherla Harisarvothama Rao, who sowed the seeds of public library and literacy movements in the district decades earlier.

When we realize that the savings movement in Nellore and the women’s self-help movement in Kurnool have ultimately converged into a unified struggle for female empowerment, it becomes evident that the literacy movements of both districts have assumed the exact same historical form. Even these current forms are transient. Who can predict what new liberation movements they will forge in the years to come?

Featured image pc:https://indiatogether.org/

25-7-2026

4 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-18”

  1. The primary purpose of a social movement is not to instantly deliver material demands to the masses; no movement can accomplish such a feat overnight. Instead, a movement brings long-dormant human aspirations to the surface.

    నిద్రాణమై ఉన్న ఆకాంక్షలను జాగృతం చేసిన ఉద్యమం సఫలమైనట్టే.

  2. What an indepth analysis of the Kurnool Total Literacy Campaign, Sir.

    కర్నూలు అక్షరాస్యతా కార్యక్రమాన్ని చాలామంది ఒక విఫలమైన కార్యక్రమంగా చూస్తే, మీరు దాన్ని ఒక జయప్రదమైన ఉద్యమంగా ఎందుకు చూస్తున్నారో ఎంతో సాధికారంగా, research-backed analysis చేశారు!

    Immediate outcomes కంటే, ఆ ఉద్యమం ప్రజల్లో చదువుకోవాలన్న ఆకాంక్షను మేల్కొలపడం, ఆ తర్వాత అది వివిధ రూపాల్లో వ్యక్తమవడం,
    నెల్లూరులో సారావ్యతిరేకోద్యమంగా, ఆ తర్వాత పొదుపులక్ష్మి ఉద్యమంగా రూపు ధరించడం గురించి మీరు చెప్పిన విషయాలు ఆలోచింపజేసాయి.

    Numbers might matter, but they can never fully capture the transformation that happens in people and in society అని అర్థం అయింది.

    Very valuable lesson, Sir!! చాలా విషయాలు తెలుసుకున్నాను. 🙏🏽

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ !మీ స్పందన చూసిన తర్వాత నాకు నా దారి పట్ల నమ్మకం బలపడుతోంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading