
ఈ నెలరోజులుగా ప్రాచీన గ్రీకు కవయిత్రి శాఫో కి రాస్తూ వచ్చిన ఉత్తరాల్లో మీరు కూడా co-correspondents గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఉత్తరాల్ని ఇలా ఈ బుక్ గా మీ చేతుల్లో పెడుతున్నాను. స్వీకరించండి.
ఈ ఉత్తరాల మీద ఎందరో మిత్రులు ఫేస్ బుక్ లోనూ, నా బ్లాగులోనూ కూడా ఎన్నో ఆత్మీయ స్పందనలు పంచుకున్నారు. వాటిల్లోంచి కొన్ని ఏరుకుని ఇందులో చేర్చుకున్నాను. అందుకు మిత్రులు అనుమతిస్తారనే నా నమ్మకం.
తాడికొండ గురుకుల పాఠశాలలో నా సహాధ్యాయి పి.వి.ఎస్.ఎస్. రాజేంద్ర ప్రసాద్ కు ఈ పుస్తకాన్ని సంతోషంగా కానుక చేస్తున్నాను.
ఇది నా 79 వ పుస్తకం.
25-5-2026


Thank you very very much Sir.. ❤️❤️. ఇన్ని కానుకలు, ఇంత ప్రేమగా, శ్రద్ధగా, consistent గా గుప్పించిన మిత్రులు స్నేహాల విషయంలో పెట్టి పుట్టాననుకునే నాకు కూడా లేరు. ఉత్తరాలకు ఉత్తరాలే జవాబు రాయాలని తెలిసి కూడా ఊరికే చదువుకుంటూ పొంగిపోయిన అనాగరికపు rude behaviour ను చూస్తూ నవ్వుతూ క్షమిస్తారో, ప్రేమగా అర్థం చేసుకుంటారో కానీ… Blessed to have you here. And thanks again. ❤️
చక చకా పేజీలు తిప్పి స్పందనల్లో నా పేరు కూడా చూసి చాలా సిగ్గుపడిపోయాను. I felt ashamed. 😭
నా రచనలను ‘ఎంతో ప్రేమగా శ్రద్ధగా consistent గా’ ప్రోత్సహిస్తున్న వారిలో మీరే మొదటి వారు.
Sir, heartfelt congratulations on your 79th book!
Very happy to see my blog comment included in this very special work. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఉత్తరాలకి మీరు కూడా co-correspondent కదా!