రెండు సమీక్షలు

ఎ. రవీంద్రబాబు సీనియర్ పాత్రికేయులు, కథకులు, సాహిత్యవేత్త. ఆయన నా పుస్తకాలు అయిదింటిపైన చేసిన సమీక్షల్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ప్రపంచ మానవ జీవన చిత్రణ ప్రపంచ కథా సాహిత్యంలో తనను ప్రభావితం చేసిన ఇరవై కథలను ‘నన్ను వెన్నాడే కథలు’గా మన ముందుకు తెచ్చారు చిన వీరభద్రుడు. ఇందులో ప్రతీ కథా వస్తు, శిల్పాలపరంగా వైవిధ్యంతో అక్కడి సమాజాన్ని, సంస్కృతిని, మూలాల్ని, వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. మనిషి స్వభావాన్ని మంచు బిందువులా తాకి చూపిస్తుంది. కమలేశ్వర్ …

గురుదక్షిణ

డా.రవీంద్రకుమార శర్మగారితో 2010 లో అదిలాబాదులో కళాశ్రమంలో చేపట్టిన సంభాషణల్ని ధారావాహికంగా నా బ్లాగులో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ సంభాషణల్ని ఇలా పుస్తక రూపంలో ఈ గురుపూర్ణిమ శుభదినాన మీతో పంచుకుంటున్నాను. 416 పేజీల ఈ పుస్తకం డిజిటల్ ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.

ప్రియమైన శాఫో

ఈ నెలరోజులుగా ప్రాచీన గ్రీకు కవయిత్రి శాఫో కి రాస్తూ వచ్చిన ఉత్తరాల్లో మీరు కూడా co-correspondents గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఉత్తరాల్ని ఇలా ఈ బుక్ గా మీ చేతుల్లో పెడుతున్నాను. స్వీకరించండి.