ఆ వెన్నెల రాత్రులు

ఎప్పుడో 1987 లో మొదలుపెట్టిన నవల. రెండేళ్ళ కిందట పూర్తిచేయగలిగాను. అప్పణ్ణుంచీ ప్రచురిద్దామనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను.  ఇప్పుడు ఈ వసంతపూర్ణిమ నాడు ఈ పుస్తకాన్నిట్లా మీ చేతుల్లో పెడుతున్నాను.

మా బాల్యమిత్రుడూ, మా ఊరిని ఎంతో ప్రేమించినవాడూ, ఇప్పుడు స్వర్గంలో ఉన్న శ్రీధర మల్లికార్జునరావుకి ఈ పుస్తకాన్ని ప్రేమగా సమర్పిస్తున్నాను.

అడిగిన వెంటనే ఈ పుస్తకానికి ముందుమాట రాసిచ్చిన మిత్రులు కల్యాణి నీలారంభంగారు కూడా స్వర్గం నుంచే ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంటారని నమ్ముతున్నాను.

ఈ నవల సీరియలుగా నా బ్లాగులో వెలువడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ఎంతో ఆదరంగా చదివి నన్ను ప్రోత్సహించిన మిత్రులు సునీత రత్నాకరంగారు ఈ పుస్తకం మీద నాలుగు వాక్యాలు రాయడం నా భాగ్యం. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

పుస్తకం కవర్ పేజీ మీద తాను తీసిన ఫొటో ఉపయోగించుకోడానికి అనుమతించిన మిత్రులు విజయ్ జీడిగుంటకి ప్రత్యేక ధన్యవాదాలు.

ఇది నా 60 వ పుస్తకం. ఎప్పట్లానే ఈ పుస్తకాన్ని కూడా మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను.

8-4-2025

21 Replies to “ఆ వెన్నెల రాత్రులు”

  1. నాకు మిమ్మల్ని, మీ రచనల్ని చాలా చాలా దగ్గర చేసిన ఆ వెన్నెల రాత్రులు పుస్తకానికి కవర్ పేజీ గా నేను తీసిన ఫోటోని తీసుకోవడం నిజంగా నా భాగ్యం. ధన్యవాదాలు భద్రుడు గారు.. అంతా ఒకేసారి మళ్ళీ ఒకసారి చదవాలి.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  2. మీ నవల ధారావాహికగా వస్తున్న ఆ రోజులన్నీ వెన్నెల రాత్రులే!
    రోజూ ఎదురు చూస్తూ ఉండటమే కదా!
    అదొక spell లా గడిచింది. మొత్తం గా ఇప్పుడు PDF రూపంలో అందజేసినందుకు ధన్యవాదాలు.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!

  3. నవల ఆసక్తి రేకెత్తిస్తోంది. అరణ్యం తరవాత మీరు రాసిన నవల ఇదేనేమో నాకు తెలిసి. చదివిన తర్వాత నా అభిప్రాయం ప్రకటిస్తాను.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  4. సర్…
    షష్టి పూర్వక అభినందనలు…
    ప్రేమతో,
    రాం భాస్కర్ రాజు
    హనుమకొండ
    9849169320

  5. ప్రతిఫలం ఆశించకుండా మీ రచనలను పాఠకులకు అందిస్తుస్తున్న మీ ఔదార్యానికి హృదయ పూర్వక ధన్యవాదములు. అభినందనలు.

  6. ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈ
    పున్నమి వేకువలో
    పరవశిస్తూ పరిమళించిన తరుణం
    ఉదయాన్నే వెన్నెల
    హృదయం లో వెల్లివిరిసింది
    ధన్యుడిని

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  7. Thank you very much sir for one more book.I am eagerly waiting for it.
    I have doubt for long time.But it is not correct time to ask.
    He is in Swargam .I heard so many times.
    Plz want to listen from you.
    I am not humiliating that person.
    Plz accept my ignorance

    1. ఒక మనిషి ఈ లోక నుంచి నిష్క్రమించాక అతను మన గుర్తొచ్చినప్పుడల్లా మనకు సంతోషం కలుగుతున్నది అంటే అతను స్వర్గంలో ఉన్నట్టే. అలా కాక ఒక మనిషి బతికి ఉన్నప్పుడు తర్వాత కూడా అతని తలపులు మనకి బాధ కలగజేస్తున్నాయంటే అతడు నరకంలో ఉన్నట్టే.

  8. మీకు మనసు పూర్తిగా అనేక అనేక ధన్యవాదాలు. తప్పకుండా మరో సరి చదివి తీరాలి.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%