మంత్రాలయసన్నిధిలో

గతంలో ఎన్నో సార్లు మంత్రాలయం వెళ్ళినా ఎన్నడూ లేనట్టుగా ఈ సారి స్వామి సన్నిధి మరింత సన్నిహితంగా తోచింది. అన్నిటికన్నా ముందు ఆయన ముందొక కవి అనీ, నాబోటి వాళ్ళ వేదనకొక గొంతునిచ్చాడనీ అర్థమయింది.

రసధార

గత పదిపదిహేనేళ్ళుగా రాస్తూ వచ్చిన వ్యాసాల్లో నాటకానికీ, నాట్యానికీ, సంగీతానికీ సంబంధించిన వ్యాసాలు ఏమున్నాయా అని చూస్తే 45 వ్యాసాలు మాత్రమే తేలాయి. ఇప్పుడు ఈ 45 వ్యాసాల్నీ ఇలా 'రసధార' గా విశ్వావసు ఉగాది కానుకగా మీ చేతుల్లో పెడుతున్నాను. ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. అద్వితీయ నాటకప్రయోక్త టి.జె.రామనాథం గారి స్మృతికి ఈ పుస్తకాన్ని కానుక చేస్తున్నాను. ఇది నా 59 వ పుస్తకం.

పుస్తక పరిచయం-13

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా గత రెండువారాలుగా టాగోరు కవిత్వం గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాం. ఆ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ రోజు వనమాలి (1913) లో కవిత్వం గురించీ, ముఖ్యంగా చిత్రాంగద (1892) రూపకం గురించీ ప్రసంగించాను. ఈ ప్రసంగం వినడానికి ఈ లింకు తెరవచ్చు.

Exit mobile version
%%footer%%