గత పదిపదిహేనేళ్ళుగా రాస్తూ వచ్చిన వ్యాసాల్లో నాటకానికీ, నాట్యానికీ, సంగీతానికీ సంబంధించిన వ్యాసాలు ఏమున్నాయా అని చూస్తే 45 వ్యాసాలు మాత్రమే తేలాయి. ఇప్పుడు ఈ 45 వ్యాసాల్నీ ఇలా 'రసధార' గా విశ్వావసు ఉగాది కానుకగా మీ చేతుల్లో పెడుతున్నాను. ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. అద్వితీయ నాటకప్రయోక్త టి.జె.రామనాథం గారి స్మృతికి ఈ పుస్తకాన్ని కానుక చేస్తున్నాను. ఇది నా 59 వ పుస్తకం.
