ఒకప్పుడు మో తన జీవితంలో అమూల్యమైన క్షణాల్ని 'బతికిన క్షణాలు 'అని పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. ఇన్నాళ్ళకు నేను కూడా కొంచెం సూర్యకాంతి నా జీవితాన్ని వెలిగించిన క్షణాల్ని ఇలా మూటగట్టి మీతో పంచుకుంటున్నాను. ఇది నా 56 వ పుస్తకం. దీన్ని మా బంగారు తల్లి అమృతకి కానుక చేస్తున్నాను.
అంటున్నాడు తుకా-5
మొత్తం ప్రపంచమంతా దైవమే కావలసిందల్లా చిటికెడు ఉపదేశం మొదట నిన్ను నువ్వు నాశనం చేసుకో అప్పుడు నువ్వేమని బదులిస్తావు?
ఇద్దరు ముసలమ్మలు
పండగ వస్తోందంటే అన్నిటికన్నా ముందు మా అమ్మ ఇల్లు బూజు దులిపేది
