
5
సకలజనుల చరణాలమీద
తలవాల్చి విన్నవించుకుంటున్నాను.
వక్తలుగానీ, శ్రోతలుగానీ
నిజమెంతో పరీక్షించి మీరే చూసుకోండి.
ఒక దివ్య భాండాగారం బద్దలుగొట్టాను
ఆ సరుకంతా నెత్తిన మోసుకొచ్చేసాను.
తుకా దాన్ని నలుదిక్కులా వెదజల్లుతున్నాడు
ఎంత నిక్కమైన సరుకు దిగిందని! (58)
सकळीच्या पायां माझी विनवणी ।
मस्तक चरणीं ठेवीतसें ॥१॥
अहो श्रोते वक्ते सकळ ही जन ।
बरें पारखुन बांधा गांठी ॥ध्रु.॥
फोडिले भांडार धन्याचा हा माल ।
तेथे मी हामाल भारवाही ॥२॥
तुका म्हणे चाली जाली चहूं देशी ।
उतरला कसीं खरा माल ॥३॥
6
చూడండి కొలిచేది నేనే
అంటుంది కొలపాత్ర
ఆసామీ దాన్ని నింపుతాడా
ఇంతలోనే ఖాళీ చేసేస్తాడు
దేవుడా, నాలో ఇలాంటి
ఉబ్బు తలెత్తనీకు.
దేశమంతా చెల్లుబాటయ్యేది
రాజముద్రనే, మరేదీ కాదు
ఎవడు సూత్రధారుడో
అతడే ఘనుడంటున్నాడు తుకా. (331)
माप म्हणे मी मवितें ।
भरी धणी ठेवी रितें ॥१॥
देवा अभिमान नको ।
माझे ठायीं देऊं सकों ॥ध्रु.॥
देशी चाले सिका ।
रितें कोण लेखी रंका ॥२॥
हातीं सूत्रदोरी ।
तुका म्हणे त्याची थोरी ॥३॥
7
పాండురంగడితో కలిసి
నామదేవుడు నా కలలోకొచ్చాడు
వట్టిమాటలు కట్టిపెట్టి
గట్టికవితలు చెప్పమన్నాడు
విఠలుడు పాత్ర గట్టిగా పట్టుకున్నాడు
అభంగాలు పూర్తిగా కొలిచిపొయ్యమన్నాడు
శతకోటి గీతాలు నేను పాడాను, తుకా
మిగిలింది నీవంతన్నాడు. (753)
नामदेवें केलें स्वप्नमाजी जागें ।
सवें पांडुरंगें येऊनियां ॥१॥
सांगितलें काम करावें कवित्व ।
वाउगें निमित्य बोलों नको ॥ध्रु.॥
माप टाकी सळे धरिली विठ्ठलें ।
थापटोनि केलें सावधान ॥२॥
प्रमाणाची संख्या सांगे शत कोटी ।
उरले ते शेवटीं लावी तुका ॥३॥
6-2-2025