ఉత్తర ద్వారం

ఈ కాలమంతా
ఒక తలుపు తెరుచుకుంటూనే ఉంటుంది
అది కనబడేది కాదు
వినబడేది.

తల పైకెత్తి చూడు
ఆకాశమంతా
తలుపులు బార్లా తెరుచుకుంటున్న
నీలలోహిత ప్రకంపన.

ముంచెత్తే ఆ మందాకిని లో
మునిగి తేలకుండా
నువ్వు గుడికి వెళ్ళి ఏం లాభం?

తెరుచుకుంటున్న ఆ తలుపులు తీసి
నీలోకి నువ్వు అడుగుపెట్టావా
నీ ఇల్లే గుడిగా మారిపోతుంది.


Featured images courtesy: pexels.com

30-12-2025


18 Replies to “ఉత్తర ద్వారం”

      1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  1. ఉదయం లేవగానే మీ పద్యం చదివాను. ఆఫీసుకు వచ్చేముందు గుడికి వెళ్ళినప్పుడు ఈ పద్యం జ్ఞాపకం వచ్చింది. ఆదిశంకరుని మంత్ర సారం మొత్తం ఈ చిన్న పద్యంలో చెప్పారు

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%