మరో నాలుగు పుస్తకాలు

ఇప్పుడు నా రచనలలో సరికొత్తగా మరో నాలుగు పుస్తకాలు మొన్ననే ప్రింటు కాపీలు విడుదల అయ్యాయి. Shri Pada Literary Works వారు వెలువరించిన నాలుగు పుస్తకాలూ ఇవి. ఇందులో బసవన్న వచనాలు కిందటేడాది వెలువరించినప్పటికీ ఆ 100 కాపీలు అయిపోవడంతో, చాలామంది మిత్రులు పదేపదే అడుగుతుండటంతో, ఆ పుస్తకం కూడా మరోసారి ముద్రించి విడుదల చేస్తున్నారు. ఒక్కొక్క పుస్తకం 100 కాపీల చొప్పున మాత్రమే ప్రింటు చేయించారు కాబట్టి ఆసక్తి ఉన్నవారు తెప్పించుకోవచ్చు.

1. బసవన్న మూడు వందల వచనాలు, విపుల పరిచయంతో అనువాదం, పేజీలు 352+4, వెల రు.350

2. దత్తాత్రేయుల అవధూత గీత, విపుల పరిచయం, సంస్కృత మూలంతో అనువాదం, పేజీలు 192+4, వెల రు. 250

3. ఆ వెన్నెల రాత్రులు, నవల, పేజీలు 284+4, రు.350

4. సంతోషం ఒక క్రియాపదం, సత్యశోధకులూ, సన్మార్గ సాధకులూ, పేజీలు 208+4, వెల రు. 250

పుస్తకాలు కావలసిన వారు-

Shri Pada Literary Works
House No. 12-2-505/28&29
Flat No.301, 3rd Floor, Venkata Sai Homes
Gudimalkapur, Mehidipatnam
Hyderabad, Telangana State 500 028

కి రాయడం ద్వారాగాని,

లేదా 90639 92633 కి ఫోను చేయడం ద్వారాగాని, వాట్సప్ మెసేజి పంపించడం ద్వారా గాని పుస్తకాలు తెప్పించుకోవచ్చు.

6-12-2025

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%