
మీ యాభయ్యవ పుస్తకం ప్రత్యేకంగా ఉండబోతోంది కదా అనడిగారు ఒక మిత్రురాలు. అవునన్నాను. ఏమిటా పుస్తకం అనడిగారు. చెప్పలేదు. చెప్పకూడదని కాదు. చెప్పడానికి ధైర్యం చాల్లేదు. ఎందుకంటే నేననుకున్నట్టుగా ఆ పుస్తకం తేగలనా అన్న ఆందోళన నా మనసుని అంటిపెట్టుకునే ఉందిన్నాళ్ళూ. ఏమైతేనేం, భగవంతుడి దయ వల్ల, ఇదుగో, ఈ ‘మూడువందల వచనాలు’ నిన్ననే శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునుల చరణాల దగ్గర సమర్పించగలిగాను.
కిందటి కార్తిక- మార్గశిరాల్లో బసవన్న వచనాల అనువాదం పూర్తయ్యింది. కానీ అప్పణ్ణుంచీ ఈ ఏడాదంతా నాకు ప్రత్యేకంగా గడిచింది. ఈ రోజులంతటా నేను మనుషులకి ఇంచుక దూరంగానూ, దేవుడికి మరింత దగ్గరగానూ జీవిస్తో వచ్చాను.
కూడలసంగమ జ్ఞానం పోలిక లేనిది,
అది మనల్ని ప్రపంచ వ్యవహారంలో మననివ్వదు.
అన్నాడు బసవన్న. ఆయన అన్నట్టే, ఈ ఏడాది పొడుగునా దేవుడు అడుగడుగునా నా చేయి పట్టుకుని విడవనేలేదు.
ఇది నా 50 వ పుస్తకం. తెలుగు సాహిత్యానికి నేను చేయవలసిన సేవ ఏదైనా ఉంటే ఈ పుస్తకంతోటే మొదలవుతున్నదని నమ్ముతున్నాను.
ఈ పుస్తకం ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో షేర్ చేసుకోవచ్చు.
శ్రీపాదప్రచురణవారు ఈ పుస్తకం వంద కాపీలు ప్రచురించారు. 354 పేజీలు. వెల రు.300/-
హార్డ్ కాపీ కావలసినవారు sripadaprachuranalu@gmail.com వారికి ఈ మెయిల్ కాని లేదా 8500707157 కి వాట్సప్ మెసేజి కానీ పంపవచ్చు.
1-12-2024
మీ కృషికి
పాదాభివందనాలు.సార్
ధన్యవాదాలు గోపాల్!
ఈ సంవత్సరం చివరి నెల మొదటి రోజున కానుకని ఇచ్చారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకైతే మీ ప్రతిరచన అమూల్యము అద్భుతమే ప్రత్యేకమైనవే
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
సాహిత్యసేవ ఇప్పటినుండే మొదలవుతుందనేది శుభవార్త!
ధన్యవాదాలు సార్
చాలా సంతోషమండీ. ఈ మధ్య పాలకుర్తి వెళ్లినప్పుడు బసవపురాణం, మీ అనువాదం తలచుకున్నా. ఇప్పుడు హార్డ్ కాపీ తెప్పించుకుంటాను.ధన్యవాదాలు🙏
ధన్యవాదాలు మేడం
నమఃపూర్వక అభినందనలు సార్.
ధన్యవాదాలు సార్
బసవేశ్వరుని వచనాలు తెలుగులో చదవడం ఓ అద్భుతం. ధన్యవాదాలు మీకు 💐💐💐💐💐💐💐💐
ధన్యవాదాలు ప్రసూనా
మెయిల్ లోనూ,వాట్సప్ లోనూ కాంటాక్ట్ చేద్దామంటే కలవటం లేదు సర్!
It gets activated by evening.
మాకు తపస్సుకి ముందే దక్కిన నామఫల రసాయనం మీ వచనానుగ్రహం…🙏🙏🙏🙏
ధన్యవాదాలు బాలయ్య గారూ!
Sir
Thank you very much
ధన్యవాదాలు