గిరోయి అంటే రష్యన్భాషలో హీరో అని అర్థమట. డా.మంగాదేవిగారు సోవియెట్ రష్యాలో ఉన్నప్పుడు ఒకసారి తూర్పుదేశాల యాత్ర ముగించుకుని రాగానే ఆమె క్లాసు టీచర్లు, కాస్మేట్స్ అంతా ఆమెని గిరోయి అంటూ ఆకాశానికెత్తేసారట. ఈ పుస్తకానికి ఏమి శీర్షిక పెట్టాలి అనడిగితే గిరోయి అనే పెట్టమంటాను. ఎందుకంటే ఇది నిజంగానే ఒక వీరవనిత కథ, ఒక ధీరవనిత కథ. ఒక సాహసమహిళ కథ, సంపూర్ణమానవి కథ.
