మూడువందల వచనాలు

మీ యాభయ్యవ పుస్తకం ప్రత్యేకంగా ఉండబోతోంది కదా అనడిగారు ఒక మిత్రురాలు. అవునన్నాను. ఏమిటా పుస్తకం అనడిగారు. చెప్పలేదు. చెప్పకూడదని కాదు. చెప్పడానికి ధైర్యం చాల్లేదు. ఎందుకంటే నేననుకున్నట్టుగా ఆ పుస్తకం తేగలనా అన్న ఆందోళన నా మనసుని అంటిపెట్టుకునే ఉందిన్నాళ్ళూ. ఏమైతేనేం, భగవంతుడి దయ వల్ల, ఇదుగో, ఈ 'మూడువందల వచనాలు' నిన్ననే శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునుల చరణాల దగ్గర సమర్పించగలిగాను. ఈ పుస్తకం ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో షేర్ చేసుకోవచ్చు.

బసవపురాణం-9

తాను శివశరణుల తొత్తుననీ, లెంకననీ బసవణ్ణ తన కవిత్వంలో పదే పదే చెప్పుకున్నాడు. అటువంటి కవిత్వం చదువుతున్నప్పుడు మనలో ఒక వైపు అటువంటి మహామానవుడు మేల్కొంటూ మనలోని లఘుమానవుడు అణగిపోతూ ఉండటం మనకి అనుభవానికొస్తుంది.

బసవపురాణం-8

పాల్కురికి సోమన రాసిన బసవపురాణంలో బసవన్న భక్తిని ఏ విధంగా వర్ణించాడో మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్నటి ప్రసంగానికి కొనసాగింపు ఈ రోజు ప్రసంగం.

Exit mobile version
%%footer%%