
పాల్కురికి సోమన బసవపురాణం మీద చేస్తూ వచ్చిన ప్రసంగాల్లో ఇది తొమ్మిదో ప్రసంగం. మధ్యయుగాల భక్తి సాహిత్యమంతటిలోనూ ప్రధానంగా కనవచ్చే లక్షణం ఆ కవులకి మనిషి ముఖ్యం తప్ప అతడి జాతీ, కులం ముఖ్యం కాకపోవడం. ఆ మనిషి తనకోసం కాక, ఒక అత్యున్నత సత్యం కోసం బతికేవాడైతే, అటువంటి సత్యాన్ని నమ్మినవాడైతే తాము అతడికి ఊడిగం చెయ్యడానికి కూడా సిద్ధమేనని ఆ కవులు చెప్పుకున్నారు. తాను శివశరణుల తొత్తుననీ, లెంకననీ బసవణ్ణ తన కవిత్వంలో పదే పదే చెప్పుకున్నాడు. అటువంటి కవిత్వం చదువుతున్నప్పుడు మనలో ఒక వైపు అటువంటి మహామానవుడు మేల్కొంటూ మనలోని లఘుమానవుడు అణగిపోతూ ఉండటం మనకి అనుభవానికొస్తుంది.
Featured photo: Shiva and Parvati, Seated on Mount Kailasa. 18th century miniature, PC: Wiki Commons Images.
23-11-2023
సంపూర్ణంగా వికసించిన భక్త కవుల (across faiths) గీతాల కావ్యాల సమక్షంలో మీకు మీరు విశ్వమానవునిగా కనిపించడం – superbly expressed sir, the transformational effect these poets ‘ lives and works have on you. 🙇🏻♀️
ఇదే కదా కావ్య ప్రయోజనము!! కాని ఎందరు well read people ఈ మాటని with conviction చెప్పగలరు?!
— just a thought by an unlettered follower just by listening to your talks
ధన్యవాదాలు మాధవీ! మీరీ ప్రసంగాలు వింటూ ఉండడం, ఈ విధంగా మీ స్పందన పంచుకోవడం నాకు కొండంత బలాన్ని ఇస్తోంది.
నమ్మిన మాటలకి జీవితాంతం కట్టుబడి ఉండటం ద్వారా ఒక వ్యక్తి ఎంతటి మహనీయుడయ్యాడో ఈ రోజు తెలుసుకున్నాం. నిజమే కదా…ఒక విషయాన్ని నమ్మిన తర్వాత ఇంక జీవితంలో దేని గురించీ వెతుకులాడరాదు…అదే జీవితమవ్వాలి. ఇదే సత్యం.
ధన్యవాదాలు స్వాతీ!
Only those you subscribe to the message by the messiah get the benefit of their knowledge and it is not for the chosen few – examples messages of Christ and the Buddha.
“బసవక్రాంతి”, “సమరసభక్తి” గొప్ప మాటలు!!
🙏🏽
You have a very keen ear. Thank you once again.