ప్రభాతసంగీతం

ఆ గాయకులు తాము గానం చేసిన రెండున్నర గంటల పాటూ అక్కడ అటువంటి ఒక వేడుకనే నడిపారనిపించింది. మనం పండగల్లో మట్టితో దేవతను రూపొందిస్తే వారు మన చుట్టూ ఉన్న గాల్లోంచి సంగీతదేవతను ఆవాహన చేసారు.

బసవన్న వచనాలు-4

భారతీయ సామాజిక చరిత్రలో ఇలా ఆత్మ వంచననీ, కాపట్యాన్నీ దుమ్మెత్తిపోసినవాళ్ళల్లో బసవన్ననే మొదటివాడని గమనిస్తే, పన్నెండో శతాబ్దంలోనే అటువంటి నిరసన ప్రకటించడంలోని నిజాయితీ, నిర్భీతీ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అటువంటి మానవుణ్ణి ఆరాధించకుండా ఉండలేమనిపిస్తుంది

బసవపురాణం-9

తాను శివశరణుల తొత్తుననీ, లెంకననీ బసవణ్ణ తన కవిత్వంలో పదే పదే చెప్పుకున్నాడు. అటువంటి కవిత్వం చదువుతున్నప్పుడు మనలో ఒక వైపు అటువంటి మహామానవుడు మేల్కొంటూ మనలోని లఘుమానవుడు అణగిపోతూ ఉండటం మనకి అనుభవానికొస్తుంది.

Exit mobile version
%%footer%%