
ఆమె ఆలపించడం మొదలుపెడుతూనే
ఒక లాండ్ స్కేప్ దగ్గరగా జరిగినట్టుంది.
చెట్లు చిగురించే దేశాల వార్తల్తో ఎవరో
ఇప్పుడే హుటాహుటిన బయల్దేరినట్టుంది.
ఆమె తొలి చరణం మొదలుపెడుతూనే
మేతకు పోయిన తల్లిని వెనక్కి పిలిచినట్టు
పల్లెలో నీ పాత ఇంటి పసులకొట్టం లోంచి
ఒక లేగదూడ అంబారవం చేసినట్టుంది.
ఆమె చివరి చరణానికి చేరుకుందోలేదో
తప్పిపోయిన పిల్లలు వెనక్కి వచ్చినట్టుంది.
పాట పూర్తవుతూనే నీ పాతమిత్రులు
బిలబిల్లాడుతూ నీ చుట్టూ చేరినట్టుంది.
23-3-2023


ఉదయమే ఒక మంచి కవిత. ప్రేమతో ఎవరో అలదిన చల్లని చందనగంధ స్పర్షవలె. 🙏
ధన్యవాదాలు
ఆమె పాడుతూనే వుండుగాక 😊👌
థాంక్యూ
వసంత రాగం
ధన్యవాదాలు
ఆమె ఎవరైతేనేం, తానే పాట గా మారిపోయింది
Thank you
పాటైన ఆమె
Thank you
ఆమె పాట ఇంకొన్ని చిత్రాలను, వర్ణనలను, ఊహలను ప్రోది చేస్తూనే ఉండాలి.
ధన్యవాదాలు