అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి

ఒకప్పుడు హళేబీడు, రామప్ప వెళ్ళినప్పుడు ఆ శిల్పులు రాతిని వెన్నగా మార్చి శిలని సంగీతంగా వికసింపచేసారని రాసుకున్నాను. కాని మన కాలంలో మన ఒక చిత్రకారుడు ఇలా ఒక దారుఖండాన్ని ఒక విష్ణుస్తుతిగా మార్చడం నా కళ్లారా చూడగలనని ఎన్నడూ అనుకోలేదు.